హెలికాప్టర్‌లో కూతురిని అత్తారింటికి పంపిన తండ్రి

పెళ్లి తర్వాత తన కూతురిని అత్తారింటికి వినూత్న పద్ధతిలో పంపాలనుకున్నాడో తండ్రి. ఆలోచన వచ్చిందే చాలు అన్నట్లుగా పెళ్లి తర్వాత తన కూతురిని అత్తారింటికి పంపడానికి హెలికాప్టర్ రప్పించాడు ఆ తండ్రి. రాజస్థాన్‌కు చెందిన మహేంద్ర సింగ్ శ్లోకా డిగ్రీ చదువుతున్న తన కూతురికి పెళ్లి చేయాలని సంవత్సరం క్రితం నిశ్చయించుకున్నాడు. అయితే తన కూతురిని అందరిలా కాకుండా కొత్తగా అత్తారింటికి పంపాలనుకున్నాడు. అందుకే హెలికాప్టర్ బుక్ చేశాడు. కూతురు రీనాను.. రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న సందీప్ అనే యువకుడికి ఇచ్చి బుధవారం వివాహం చేశాడు. తమ స్వగ్రామమైన అజిత్ పురా నుంచి అల్లుడి గ్రామమైన సుల్తానాకు హెలికాప్టర్‌లో పంపించాడు మహేంద్ర సింగ్. తమ గ్రామానికి హెలికాప్టర్ రావడంతో పిల్లలు హెలికాప్టర్‌ చూడడానికి బారులు తీరారు. దీన్ని బట్టి మహేంద్రకు కూతురి మీద ఉన్న ప్రేమ గురించి చెప్పక్కర్లేదు.

Latest Updates