కన్న కొడుకును కిడ్నాప్ చేసి అమ్ముకున్న తండ్రి

V6 Velugu Posted on Apr 19, 2021

జల్సాలకు అలవాటు పడిన ఓ తండ్రి కన్న కొడుకునే కిడ్నాప్ చేసి అమ్ముకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో జరిగింది. MM పహాడికి చెందిన హైదర్ అలీ, షాహీన్ బేగం భార్యాభర్తలు. హైదర్ ఆటో డ్రైవర్. ఏడాది కిందట వీరికి మ్యారేజ్ కాగా..ఇటీవలే షాహీన్ ఓ కుమారుడికి జన్మనిచ్చింది.

అయితే జల్సాలకు అలవాటు పడిన హైదర్ అప్పులు చేయడం...అవి కాస్తా ఎక్కువ కావడంతో..తన కొడుకును అమ్మి అప్పులు తీర్చాలనున్నాడు. ఇదే విషయంపై షాహీన్ వేధించడం మొదలు పెట్టాడు.ఈ నెల 15వ తేదీన షాహీన్ నమాజ్ చేసుకుంటుండగా బాబును అడిస్తానని చెప్పి తీసుకుని నలుగురి సహాయంతో మూడు లక్షల 80 వేల రూపాయలకు అమ్మాడు. విషయం తెలుసుకున్న తల్లి షాహీన్ బేగం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవాళ నిందితులను వట్టే పల్లి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. బాబును తల్లికి క్షేమంగా అందించిన పోలీసులు.. ఈ కేసులో ఐదు మంది నిందితులతో తో పాటు తండ్రి అరెస్టు చేసి హైదర్ అలీ రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి రెండున్నర లక్షల రూపాయల నగదును రికవరీ చేశారు.

Tagged sold, father, hydera bad, kidnapped son, pay debts

Latest Videos

Subscribe Now

More News