వివాహిత ప్రేమాయణం…తండ్రి గొంతు కోసిన ప్రియుడు

ప్రియుడితో కలిసి పారిపోడానికి ప్రయత్నించిన ఆమెను తండ్రి అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు అతని గొంతుకోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగింది.

అనపర్తి పాత ఊరికి చెందిన చింతపల్లి శేషారత్నం అనే వివాహిత తన కుమార్తెను స్కూలుకు పంపే క్రమంలో బస్సు క్లీనర్‌తో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగామారింది. దీంతో ఆ ఇద్దరు ఎక్కడికైనా పారిపోయి కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి శేషారత్నం ప్రియుడితో పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న తండ్రి వెంకటేశ్వరరావు.. శేషారత్నాన్ని మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ప్రియుడు.. వెంకటేశ్వరరావు గొంతు కోసి అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడ్డ బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Latest Updates