వీటితో అలసట దూరం!

సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది నీరసంగా, నిస్సత్తువగా కనిపిస్తుంటారు. అలసటకు కూడా గురవుతుంటారు. రోజంతా ఇలా ఉండటం చిరాకును కూడా కలిగిస్తుంది. ఫిట్‌‌గా, యాక్టివ్‌‌గా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోజూ వ్యాయామం చేయడం మంచి అలవాటు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే యాక్టివ్‌‌గా, ఫిట్‌‌గా ఉండటమే కాక అనారోగ్యాలు కూడా దరిచేరవని చెబుతున్నారు నిపుణులు.

ఆహార పదార్థాల విషయానికి వస్తే… కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్‌‌లో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నిద్రలేమి వల్ల నీరసంగా, అలసటగా ఉంటారు. వీటన్నింటితో పాటు నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి రాత్రిపూట పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి తాగితే చక్కగా నిద్రపడుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల కూడా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల రక్తసరఫరా మెరుగుపడుతుంది.

Latest Updates