పొలిటికల్ యాడ్స్‌‌కు ఎఫ్‌బీ కొత్త రూల్స్

లోక్ సభ ఎన్నికల క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ గురువారం కీలక ప్రకటన చేసింది. దేశంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు తెలిపింది. తమ ప్లాట్ ఫాంపై కనిపించే యాడ్స్ విషయంలో పలు మార్పులు చేసినట్లు వెల్లడించిం ది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల్లో ‘పబ్లి ష్డ్ బై’, ‘పెయిడ్ ఫర్బై’ వంటి డిస్ క్లైమర్లను ఇకపై అందరూ చూడొ చ్చని చెప్పింది. ప్రకటనదారుల సమాచారం కూడా తెలుసుకోవచ్చని తెలిపింది. తాము ‘యాడ్ లైబ్రరీ’పై కూడా పని చేస్తున్నట్లు తెలిపింది. రాజకీయ ప్రకట నలకు సంబంధించిన అన్ని అంశాలను యూజర్లు అందులో పొందవచ్చని వెల్లడించిం ది. ఓ యాడ్ పై ఎంత ఖర్చు చేశారు, దాన్ని ఎంత మంది చూశారు? వంటి వివరాలను తెలుసుకోవచ్చని చెప్పింది. ఫేస్ బుక్లోకి లాగిన్ కాకుండానే దీని సమాచారం తెలు సు కోవచ్చని చెప్పింది. వచ్చే మార్చి నాటికల్లా ఈ లైబ్రరీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

డిస్ క్లైమర్లను గురించిన సమాచారం లేకుండా న్యూస్ ఫీడ్ లో ఉన్న రాజకీయ ప్రకటనలను యాడ్స్ లైబ్రరీలో ఉంచుతామని ఎఫ్బీ తెలిపింది. ‘‘ఫేస్ బుక్లో రన్ అయ్యే ప్రతి రాజకీయ ప్రకటనను మా సిస్టమ్ గుర్తించలేదు. ఎవరైనా గుర్తించి రిపోర్ట్ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏదైనా యాడ్ కు డిస్ క్లైమర్ల సమాచారం ఉండాలని యూజర్లు భావిస్తే.. ప్రకటనకు కుడి వైపున పై భాగంలో మూడు చుక్కలు ఉంటాయి. అక్కడ క్లిక్ చేక్లి సి, ‘రిపోర్ యాడ్’ అ డ్ ని సెలెక్ చేస్ట్ తే చాలు. దాన్ని మేం పరీక్షిస్తాం. తర్వాత అది పాలిటిక్స్ కు సంబంధించిన యాడ్ అని తేలితే, వెంటనే అక్కడి నుంచి తొలగించి, లైబ్రరీలో భద్రపరుస్తాం. ఏడేళ వరకు ఎవరైనా దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు’’ అని ఎఫ్బీ పబ్లి క్ పాలసీ డైరెకర్ (ఇండియా)శివనాథ్ థుక్రాల్, ప్రొడక్ట్ మేనేజర్ సారా చీఫ్ తెలిపారు.

పొలిటికల్ యాడ్స్ ను రన్చేస్తున్న పేజీలకు సంబం ధించిన సమాచారాన్ని యూజర్లకు అందుబాటులో ఉంచాలని ఫేస్ బుక్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం పొలిటికల్ యాడ్స్ ను నిర్వహిస్తున్న, లేదా ఆ యాడ్స్ కు డబ్బు చెల్లిస్తు న్న సంస్థ ల లొకేషన్ను యూజర్లు చూసే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. ‘ఇన్ఫో, యాడ్స్’ సెక్షన్లో ఈ సమాచారం దొరుకుతుందని చెప్పింది. ఇండియాలో నకిలీ అకౌంట్ ద్వారా పేజీ నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఫేస్ బుక్ చెప్పింది. ఎఫ్ బీలో పేజీలు నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ అకౌంట్ ను సెక్యూర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తమ పేజీల్లో పోస్టులు కొనసాగించేందుకు, వారి ప్రైమరీ కంట్రీ లొకేషన్ ను నిర్ధారించాలని సూచించింది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్ తర్వాత ఫేస్ బుక్ పారదర్శకత నియమాలు తీసుకొస్తున్నది ఇం డియాలోనే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్ అమ్మింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఖాతాల సమాచారం అందించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

 

Latest Updates