FBI పై ట్రంప్ ఫైర్: మీ నిర్లక్ష్యం వలనే ఫ్లోరిడా ఘటన

trp బుధవారం(పిబ్రవరి14) అమెరికాలో ఓ స్కూల్ లో జరిగిన కాల్పుల విషయంపై ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ(FBI) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. ఈ ఘటన జరగకముందే లభించిన కీలక ఆధారాలను పట్టించుకొని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ట్విటర్ ద్వారా ఆయన తెలిపారు. ఫ్లోరిడా స్కూల్‌లో కాల్పులు జరిపిన నిందితుడికి సంబంధించి అతడు ఇచ్చిన అన్ని సంకేతాలను ఎఫ్‌బీఐ మిస్ చేయడం చాలా విచారకరం. ఇది ఆమోదయోగ్యమైనది కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ట్రంప్ ప్రచారంలో రష్యా జోక్యం చేసుకుందనే విషయాన్ని నిర్ధారించడానికే ఎఫ్‌బీఐ ఆసక్తి కనబరుస్తూ ఎక్కువ సమయం కేటాయించింది. ఇందులో ఎలాంటి కట్ర లేదు. వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించి మనమంతా గర్వపడేలా చేయండి అని ట్రంప్ ట్వీట్ చేశాడు. ఒక వ్యక్తి కొంతమందిని చంపాలనే లక్ష్యంతో ఉన్నాడనే సమాచారం జనవరిలోనే ఎఫ్‌బీఐకి చేరింది. అయినప్పటికీ ఈ ఘటనపై దర్యాప్తు చేయడంలో కొంతమంది ఏజెంట్లు విఫలమయ్యారని ఏజెన్సీ FBI తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates