నిర్భయ దోషులకు ఉరి భయం: జైల్లో వింత ప్రవర్తన

నిర్భయ దోషులు తీహార్ జైల్లో వింతగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు మామూలుగానే ఉన్న దోషులు అక్షయ్, ముకేశ్, వినయ్, పవన్‌.. అర్ధరాత్రి వరకు తమ తమ జైలు గదుల్లోనే నిద్ర మానేసి అటూ ఇటూ తిరుగుతున్నారు. జైలు సిబ్బంది ఇచ్చిన భోజనాన్ని తినడం లేదు. అంతేకాదు మంచినీళ్లు కూడా సరిగా తాగడం లేదు. భయం,భయంగా బతుకుతున్నట్లు కన్పిస్తున్నారు. దీనంతటికీ వారిని ఉరి తీస్తారనే ప్రచారం జరగడమే కారణమంటున్నారు జైలు అధికారులు.

నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా దోషులకు ఇప్పటి వరకూ శిక్ష పడలేదు. వీరిని ఉరితీయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్భయ దోషుల్లో ప్రాణభయం కనిపిస్తోంది. అయితే  ఉరిశిక్ష అమలు గురించి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. కానీ తిహార్ జైల్లో ఇప్పటికే ఉరి తీయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. నిర్భయ దోషులను డిసెంబర్ 16న లేదా డిసెంబర్ 29న (నిర్భయ చనిపోయిన రోజు) ఉరి తీస్తారనే ప్రచారం జరుగుతోంది.

Latest Updates