పింక్ స్లిప్ లు: ఐటీ ఉగ్యోగుల్లో భయం

  • వరుసబెట్టి లేఆఫ్స్ ప్రకటనలు
  • మిడ్ లెవెల్‌ ఉద్యోగులే టార్గెట్‌ గా లేఆఫ్స్
  • అగమ్యగోచరంగా ఉద్యోగుల పరిస్థితి

ఐటీ ఉద్యోగులకు మరోసారి పింక్‌‌ స్లిప్‌‌ల భయం పట్టుకుంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. మల్టినేషనల్ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్‌‌జెమినీలు ఇప్పటికే వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేస్తూ ప్రకటనలు చేయగా.. మరికొన్ని మధ్య తరహా కంపెనీలు కూడా ఈ ప్రకటనలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఐటీకి ప్రముఖ ఇన్‌‌స్టిట్యూట్లుగా పేరుగాంచిన ఐఐటీల్లో కూడా రిక్రూట్‌‌మెంట్లు తగ్గిపోనున్నాయి. కంపెనీలు ఐటీ ఉద్యోగుల నియామకానికి ఐఐటీలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చేందుకు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నాయి.  ఐటీ కంపెనీల నుంచి ఈ ఏడాది 15 శాతం జాబ్ ఆఫర్స్ తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇప్పటికే రిపోర్ట్‌‌లు వచ్చాయి. ఐఐటీల్లో టెక్నాలజీ, ఐటీ సంస్థల నుంచి వచ్చే జాబ్ ఆఫర్సే సాధారణంగా 60 శాతం నుంచి 70 శాతం ఉంటాయి.

ఐటీ కంపెనీలు ఎక్కువగా మిడ్ లెవెల్‌‌ ఉద్యోగులను టార్గెట్ చేశాయి. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్‌‌జెమినీ ప్రకటించిన ఉద్యోగుల కోతలో ఎక్కువగా వీరిపైనే ప్రభావం పడుతోంది. మిడ్ లెవెల్‌‌లో ఉద్యోగుల జీతం నెలకు ఆరెంకల స్థాయిలో ఉంటుంది. అంతేకాక వారి వయసు కూడా 40కి పైనే ఉంటుంది. మిడ్‌‌ లెవెల్ వారిని ఇంటికి పంపేసి.. వారి జీతంలోనే నలుగురు ఐదుగురు ప్రెషర్లను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి కంపెనీలు. మరోవైపు ఐటీలో కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి.ఈ టెక్నాలజీలకు అలవాటుపడాలంటే.. ఉద్యోగులు కూడా దానికి తగ్గట్టు మారాల్సి ఉంటుంది. అలా అప్‌‌గ్రేడ్ కాలేని మిడ్ లెవెల్ ఉద్యోగులను… ఏమాత్రం ఆలోచించకుండా కంపెనీలు తీసేస్తున్నాయి. ఈ లేఆఫ్స్ ప్రక్రియంతా సాధారణంగా వ్యాపారాల్లో జరిగేదేనని కంపెనీలు చెప్పుకొస్తున్నాయి.

40 ఏళ్ల వయసులో అగమ్యగోచరం

కాగ్నిజెంట్ అయితే భారీగా 13 వేల మందిపై వేటు వేస్తోంది. ఆ తర్వాత క్యాప్‌‌జెమినీ కూడా 500 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులకు కోత పెడుతోంది. వరుసబెట్టి ఇలా ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటనలు చేస్తుండటంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మిడ్ లెవెల్‌‌లో పనిచేసే వారినే టార్గెట్‌‌గా ప్రకటనలు వస్తుండటంతో, 40 ఏళ్లకే రిటైర్‌‌‌‌మెంట్ అయిపోయినట్టా..? అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వీరి భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతోంది. గత రెండు మూడేళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ పడిపోతూ వస్తోంది. చాలా రంగాల్లో నియామకాలు జరగడం లేదు. ఇక్కడ ఉద్యోగం పోతే, మరో దగ్గర దొరకడం కష్టతరంగా మారుతోంది. ఈ సమయంలో ఉద్యోగం పోతే.. తమ పరిస్థితి ఏమిటి? అని ఉద్యోగులు దిగులు చెందుతున్నారు.

ఆర్థిక పరిస్థితిపై ఆందోళన

ఇండియన్ ఐటీ రంగం ప్రత్యక్షంగా 41.40 లక్షల మందికి, పరోక్షంగా 1.2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తోన్న రంగాల్లో ఐటీ ముందంజలో ఉంటోంది.  ఇప్పుడు ఈ రంగంలోనే ఉద్యోగుల కోత ప్రకటనలు వస్తుంటే.. ఇప్పటికే నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితేమిటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత  రక్షణాత్మక విధానం పేరుతో..  స్థానికులకే ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించాలని ట్రంప్ పట్టుబట్టారు. ఈ మేరకు పాలసీలు కూడా తీసుకొచ్చారు. వీసాలను కూడా కఠినతరం చేశారు. దీంతో తక్కువ జీతానికి  విదేశీయులను నియమించుకునే మల్టినేషనల్ ఐటీ కంపెనీలన్నీ ఇరకాటంలో పడ్డాయి. ఒక్కసారిగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇక అప్పుడు మొదలైన లేఆఫ్స్ ప్రక్రియ ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. మరోవైపు కొన్నేళ్ల నుంచి గ్లోబల్‌‌ ఎకానమీ కూడా నెమ్మదించింది. దీంతో వ్యాపారాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. ఇండియాలో కూడా పరిస్థితులు అటుఇటుగా ఉన్నాయి. వ్యాపారాల్లో వృద్ధి సన్నగిల్లింది. చాలా కంపెనీలు తమ మార్జిన్లు కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాయి. అందుకే లేఆఫ్స్ బాట పట్టాయి.

దేశంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్‌‌లో కూడా పరిస్థితులు మారిపోయాయి. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్‌‌గా పేరున్న ఇన్ఫోసిస్ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తోంది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్లు, మధ్య స్థాయి ర్యాంక్‌‌లు కలిగిన ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నట్టు ప్రకటించింది. సీనియర్ మేనేజర్ల స్థాయి కలిగిన జాబ్ లెవల్‌‌ 6లో 2,200 మంది ఉద్యోగులను, జాబ్ లెవల్ 3, 4, 5ల్లో పనిచేసే 2 శాతం నుంచి 5 శాతం వర్క్‌‌ఫోర్స్‌‌ను తీసేస్తున్నట్టు తెలిపింది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌‌ హోదాలు కలిగిన 50 మందికి పింక్ స్లిప్‌‌లు ఇస్తున్నట్టు  చెప్పింది. అయితే 2008లో అంతర్జాతీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ఇన్ఫోసిస్‌‌ ఎలాంటి లేఆఫ్స్ ప్రకటన చేయకుండా.. ఉద్యోగులకు రీస్కిలింగ్ కార్యక్రమాలు చేపట్టింది. అన్నీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటనలు చేస్తే… ఇన్ఫోసిస్ మాత్రం ఫారిన్ లాంగ్వేజస్‌‌ వంటి ప్రొగ్రామ్స్‌‌లో శిక్షణ ఇప్పించి ప్రమాదంలో ఉన్న ఉద్యోగులను కాపాడింది. ఆ సమయంలో ఇన్ఫోసిస్‌‌ కో ఫౌండర్ నారాయణమూర్తి కంపెనీని నడిపించేవారు. కానీ ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయనే దానికి సంకేతంగా ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులపై వేటు వేసింది.

ఇన్ఫోసిస్‌‌లోనూ మారిన కల్చర్…

Latest Updates