మూలనపడ్డ ‘ఫీడ్​ ద నీడ్’​ సెంటర్లు

నిర్వహణను పట్టించుకోని బల్దియా

20 సెంటర్లకు నిలిచిన కరెంట్ సప్లై

ఫ్రిడ్జ్ లు పనిచేయక కొన్నిచోట్ల క్లోజ్

అధికారుల తీరుపై స్వచ్ఛంద సంస్థ ఆగ్రహం

హైదరాబాద్​,వెలుగు: ఆకలి తీర్చుకోవాలనుకునే వారికి ‘ఫీడ్‌ ద నీడ్‌ సెంటర్లు’ ఉపయోగపడడం లేదు.   వీటి నిర్వహణను జీహెచ్ఎంసీ సరిగా పట్టించుకోకపోవడంతో సెంటర్లు మూతపడ్డాయి.  ఒక్కో సెంటర్ ద్వారా రోజుకు100 మంది ఆకలి తీర్చే విధంగా జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో యాపిల్ ​హోమ్​స్వచ్ఛంద సంస్థ 2019 జనవరిలో 31న వీటి ఏర్పాటును ప్రారంభించింది.  ఆ తర్వాత గ్రేటర్​ పరిధిలో వివిధ ఏరియాల్లో ఏర్పాటు చేశారు. అయితే వీటికి ప్లేస్​తో పాటు ఫ్రిజ్​లకు కరెంట్​ను బల్దియా కేటాయించింది. కొన్నాళ్లు బాగానే నిర్వహణ చూసిన ఆ తర్వాత పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. దీంతో చాలా చోట్ల సెంటర్లు ఉపయోగం లేకుండా పోయాయి. మరోవైపు మరిన్ని సెంటర్లు పెట్టాలని స్వచ్ఛంద సంస్థ చూస్తుంటే.. ప్రస్తుతం ఉన్న సెంటర్లకు ఫెసిలిటీస్​ కల్పించకుండా బల్దియా నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కొత్త వాటి ఏర్పాటుకు ఇంట్రస్ట్​ చూపడం లేదు.

36  సెంటర్లు ఉండగా..

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, నైట్ షెల్టర్లు, స్లమ్​ ఏరియాలు, హాస్పిటల్స్​ ఇలా రద్దీ ప్రాంతాల్లో 36  ఫీడ్ ద నీడ్​సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్​లో ఒక ఫ్రిడ్జ్​ని పెట్టారు. హోటల్స్, హాస్టల్స్​, కంపెనీలు, ఇండ్లలో మిగిలిన ఫుడ్ బయట పాడేయకుండా వీటిలో పెడితే ఆకలితో ఉన్నవారు ఎవరైనా తీసుకొని తినొచ్చు. మొదట్లో సెంటర్లు వందలాది మంది ఆకలి తీర్చాయి. ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక ఇవి పని చేయడం లేదు. 20 సెంటర్లకు కరెంట్​సప్లై నిలిచిపోగా ఫ్రిడ్జ్​లు ఖరాబ్​అయ్యాయి. కొన్నిచోట్ల నీరు లేకపోవడంతో ఎవరూ ఉపయోగించడం లేదు.

ప్రతి డివిజన్​లో పెట్టాలని..

గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి డివిజన్​ లో 150  ఒక ఫీడ్​ ద నీడ్​ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్చంద సంస్థలతో పాటు బల్దియా కూడా చర్యలు తీసుకుంటుందని ప్రారంభంలో చెప్పింది. ప్రస్తుతం వీటి గురించి పట్టించుకోవడమే లేదు. కొత్త వాటి ఏర్పాటు పక్కన బెడితే ఉన్నవాటిపై అధికారులు దృష్టిపెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ఫీడ్ ద నీడ్​సెంటర్లు మొత్తానికే మూలన పడ్డాయి.

చెప్పినా నో రెస్పాన్స్​

స్వచ్చంద సంస్థలు స్వరీస్​ చేస్తుంటే జీహెచ్ఎంసీ నిర్ల క్ష్యంగా ఉంటుంది. తమకు సహక రించపోతుండ డంతోనే ఫీడ్​ ద నీడ్​సెంటర్లు సరిగా పని చేయడం లేదు. మొదట్లో చెప్పిన విధంగా బల్దియా స్పందించడం లేదు.  కొన్ని సెంటర్లకు పవర్​కట్​అయిందని చెప్పినా పట్టించుకోలేదు. సిటీలో 300వరకు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అందుకు ప్రభుత్వం సహకారం కోరితే స్పందించలేదు. ఇలాగైతే ప్రజలకు మేలు ఎలా  జరుగుతుంది. స్వచ్ఛంధ సంస్థలతో పాటు ప్రభుత్వం ముందుకొచ్చి నిలబడితే బాగుంటుంది.

– డాక్టర్ నీలిమా ఆర్య, యాపిల్​ హోమ్​ ఫౌండర్, ప్రెసిడెంట్​

For More News..

ఫోన్‌లో మాట్లాడొద్దన్నందుకు యువతి సూసైడ్

డ్రైవింగ్​ లైసెన్స్ జారీలో భారీ మార్పులు

Latest Updates