యాంగ్జైటీ ఫీలవుతుంటారా.. అయితే చెక్ పెట్టండి ఇలా..

మనం అనుకున్నది జరగదనో లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుందనే యాంగ్జైటీ ఫీలింగ్.. మన మెంటల్ కండిషన్​నే కాదు.. బిహేవియర్ పైనా ప్రభావం చూపిస్తుంది. ఈ జనరేషన్‌లో చాలామంది యాంగ్జైటీ మైండ్‌‌సెట్‌‌తో ఉంటున్నారు. ఈ డిజార్డర్ కాస్తా ముదిరితే స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. చిన్న చిన్న టిప్స్ పాటించడంతో స్టార్టింగ్ లెవల్‌లోనే యాంగ్జైటీ డిజార్డర్‌‌‌‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెబుతున్నారు.

ఉరుకుల పరుగుల లైఫ్ లో పని ఒత్తిడి కారణంగా చాలామంది స్ట్రెస్​కి లోనవుతుంటారు. అంతేకాదు, ఈమద్య   యాంగ్జైటీ ఫీల్ ( గాబరా) అవుతున్నవాళ్లు ఎక్కువవుతున్నారు. కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుందేమోనని, బ్యాంక్​అకౌంట్‌‌లో డబ్బులు పోతాయని, కొంచెం సిక్​ అయితే చాలు.. ఎంత పెద్ద జబ్బో అని యాంగ్జైటీ ఫీల్ అయ్యే మైండ్ సెట్ ఉన్నోళ్ల సంఖ్య పెరుగుతోంది.

లైైఫ్​లో జరిగే  కొన్ని విషయాల గురించి ఆలోచించటం స్టార్ట్ చేస్తే చాలు యాంగ్జైటీ ఏర్పడుతుంది. బిజీ లైఫ్ స్టైల్​లో యాంగ్జైటీ అనేది మామూలు విషయంలా మారింది. అయితే, ఈ యాంగ్జైటీ అనేది ఒక లిమిట్ దాటిందంటే.. అది డిఫ్రెషన్‌‌గా మారి తీవ్ర సమస్య కావొచ్చని చెప్తున్నారు హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్. అందుకే స్టార్టింగ్ లెవెల్​లోనే యాంగ్జైటీని దూరం చేసుకుంటే బెటర్ అని అంటున్నారు.

అవసరంలేని విషయాల గురించి ఎలర్ట్ గా ఉండటం

తమవాళ్లకు ఏమవుతుందో, రిలేటివ్స్, ఫ్రెండ్స్ తో గొడవలు అవుతాయేమో, వాళ్లకేమయినా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని పదే పదే ఊహిస్తూ ఆందోళన చెందుతారు. ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నోళ్లు.. అవసరం లేని విషయాలపై, యాంగ్జైటీ కలిగించే విషయాలపై ఎక్కువ ఎలర్ట్ గా ఉంటారు. న్యూస్ లో యాక్సిడెంట్ వార్తలు.. సోషల్ మీడియాలో నెగెటివ్ ఇన్ఫర్మేషన్ పై కాన్సంట్రేట్ చేస్తారు. వాటిపైనే విపరీతంగా దృష్టి పెడుతూ రోజులో ఎక్కువ సమయం గడుపుతారు. దీంతో ఖాళీ టైంలోనూ అవే ఊహలతో స్ట్రెస్​ ఫీల్ అవుతారు. ప్రజెంట్​ టైంని కోల్పోతారు. వాళ్లకు వాళ్లే మరింత నెగెటివ్ ఆలోచనలు చేస్తూ నిజమవుతాయేమోనని భయపడతారు.

ఎలా బయటపడాలి?

ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించాలి. వాస్తవంలో ఉండేందుకు ప్రయత్నించాలి. పిల్లలతో సంతోషంగా గడిపిన సందర్భాలను, వాళ్ల నవ్వును గుర్తుచేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్​తో హ్యాపీగా గడిపిన విషయాలను లేదా మనకిష్టమైన నేచర్ వ్యూ స్పాట్ ను గుర్తుచేసుకోవడం ద్వారా యాంగ్జైటీ నుంచి బయటపడవచ్చు. భయాన్ని కలిగించే ఊహలను దూరం చేసుకునేందుకు కామిక్ స్టోరీస్ చదవడం మంచిది.

అతి భయం

యాంగ్జైటీతో బాధపడుతున్నవాళ్లు ప్రతి చిన్నదానికి టెన్షన్ ఫీల్ అవుతారు. ఏదైనా ప్రమాదం జరిగే చాన్స్ ఉన్న పరిస్థితులను చాలా పెద్దవిగా చూస్తారు. చిన్నపాటి తలనొప్పి వచ్చినా ఏమైతదోనని ఆందోళన చెందుతుంటారు. కొద్ది పర్సెంటేజీ ప్రాబ్లమ్ ఉన్నా ఏదో పెద్ద జబ్బు వచ్చిందని కన్ఫమ్ అవుతారు. బ్యాంక్ నుంచి ఏదైనా లెటర్ వస్తే చాలు.. వాళ్ల అకౌంట్​లో మనీ పోయిందనో లేదా అప్పటికే పెట్టిన లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యుంటుందని భయపడి టెన్షన్ ఫీల్ అవుతుంటారు.

ఏదో చెడు జరుగుతుందని అంచనా వేయడం

యాంగ్జైటీ డిజార్డర్ ని ఫేస్ చేసేవాళ్లు.. ఒంటరిగా ఉన్నప్పుడు భయాందోళనకు గురవుతారు. ఫుల్ సెక్యూర్డ్ ఇంట్లో ఉన్నా ఎవరైనా దూరుతారేమోనని ఊహించుకుంటారు చెడు జరగొచ్చని టెన్షన్ పడుతుంటారు. జరగని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తెలియకుండానే టైం వేస్ట్ చేస్తుంటారు. ప్రతి చిన్నవిషయం గురించి ఆలోచిస్తూ పెద్ద ముప్పుగా ఫీల్ అవుతారు. తినే ఫుడ్ విషయం గురించి ఆలోచిస్తూ ‘నేను సరైనా ఫుడ్ తింటున్నాన.. విటమిన్స్ కరెక్ట్ గా అందుతున్నాయా.. నాకేమైనా లోపం వస్తుందా..’ అని టెన్షన్ పడుతుంటారు.

రిలీఫ్ అయ్యేందుకు ఇలా చేయాలి:

నెగెటివ్ సిచ్యుయేషన్స్ ఇదివరకు ఏం జరిగాయి! ఏయే సందర్భాల్లో ఎన్నిసార్లు జరిగాయి! లేదా ఎప్పుడూ జరగలేదు అనేదానిని బట్టి ప్రస్తుత విషయాలను బేరీజు వేసుకోవాలి. తద్వారా ప్రతిదాంట్లోనూ చెడు జరగొచ్చు అనే ఆలోచనలు దూరం చేసుకోవచ్చు.

ఆపద వస్తుందని భయపడటం

యాంగ్జైటీతో బాధపడే వాళ్లు.. తమ ఉద్యోగం పోతుందని, ప్రమోషన్ రాదేమోనని ఆలోచిస్తుంటారు. స్ట్రాక్ మార్కెట్ షేర్ డౌన్ అయితే చాలు.. తమ షేర్లన్నీ కోల్పోతామని టెన్షన్ పడతారు. దాంతో వచ్చే తలనొప్పిని కూడా అదేదో తీవ్రమైన అనారోగ్యానికి సింబల్ లా ఫీల్ అవుతారు. ఇలాంటివాళ్లలో యాంగ్జైటీ పెరిగి రాత్రిపూట నిద్రపట్టకపోవడం, స్ట్రెస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో రోజంతా కోపం, చిరాకు పెరిగే చాన్సెన్ ఉంటాయి.

ఏం చేయాలి

ఏదైనా బ్యాడ్ సిచ్యుయేషన్స్ జరిగితే దాన్ని తట్టుకోలేమా అని ప్రశ్నించుకోవాలి. మనకున్న క్వాలిటీస్, సదుపాయాల గురించి ఆలోచించుకోవాలి. మనకోసం కేర్ తీసుకునే వాళ్లను, ప్రశాంతంగా గడిపిన రోజులను గుర్తుచేసుకోవడం ద్వారా ఏదో విపత్తు జరగొచ్చు అనే యాంగ్జైటీ నుంచి బయటపడొచ్చు.

సేఫ్టీ సిగ్నల్స్ ను గమనించకపోవడం

పార్ట్​నర్​తో కలిసి కారులో వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందోనని టెన్షన్ పడుతుంటారు. కానీ, ఏదైనా జరిగే చాన్స్ ఉన్న సందర్భాల్లో పక్కనున్నవాళ్లు ఎలర్ట్ చేస్తారన్న సంగతి మర్చిపోతారు. చిన్నతనంలో ఇచ్చిన స్పీచ్ పై ఎవరైనా చేసిన కామెంట్ అలా మైండ్ లో పడిపోతుంది. దాన్ని గుర్తుంచుకుని పార్ట్​నర్​తో మాట్లాడితే కూడా ఏం తప్పు పడతారో అని భయపడతారు. కానీ, తానేం చెప్పినా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారనే సిగ్నల్​ యాంగ్జైటీ డిజార్డర్ వల్ల మెదడుకు అందకుండా పోతుంది.

ఎలర్ట్ కావాలంటే ఏం చేయాలి?

సేఫ్ గా ఉండేందుకు పాటించాల్సిన విషయాల గురించి ఎలర్ట్ గా ఉండాలి. మనం పాటించే సేఫ్టీ మెజర్​మెంట్స్​పై కాన్ఫిడెంట్ గా ఉండాలి. అలాంటి వాటిపై మనం ఎంత కాన్ఫిడెంట్​గా ఉంటామో గుర్తుచేసుకుంటూ జాగ్రత్తలు పాటించాలి. స్ట్రెస్ ఫీల్ అయిన గత పరిస్థితుల అనుభవాలు ప్రజెంట్ సిచ్యుయేషన్స్ పై ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయో గమనించాలి. దానిని బట్టి డిఫరెంట్ గా ఆలోచిస్తే సేఫ్టీ విషయంలో యాంగ్జైటీ లేకుండా ఉండొచ్చు.

అవాయిడింగ్

యాంగ్జైటీకి లోనయినప్పుడు గొంతు, చాతీ, కడుపులో అనీజీ ఫీలింగ్ కలుగుతుంది. దీని నుంచి బయటపడేందుకు కొంతమంది మెడిసిన్ తీసుకుంటారు. యాంగ్జైటీ డిజార్డర్​తో బాధపడుతున్నవాళ్లలో అవాయిడింగ్ లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. రిజెక్ట్ చేస్తారేమోనని ఇంటర్వ్యూని స్కిప్ చేయడం, మీటింగ్స్‌‌లో మాట్లాడితే ఎవరేమనుకుంటారోనని కామ్‌‌గా కూచోవడం వంటివి చేస్తూంటారు. యాంగ్జైటీ భరించలేక కామ్​గా ఉండటమే మంచిదని సర్దిచెప్పుకుంటారు. ఇది క్రమంగా ఏ విషయంలోనూ తలదూర్చకుండా ఉండటమే బెటర్ అనే అండర్​స్టాండింగ్​కి వచ్చేలా చేస్తుంది. తప్పించుకోవాలని చూసే ధోరణి కాస్తా.. తాము చేయగలిగే పనిని కూడా.. రిస్క్‌‌లా ఫీల్ అయ్యేలా చేస్తుంది.

చెక్​ పెట్టండిలా..

ఆందోళన చెందే విషయాలను ఎదుర్కొనేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఏయే విషయాల్లో యాంగ్జైటీకి లోనవుతున్నామో నోట్ చేసుకుని వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాంటి సందర్భాలను ఒకసారి కాన్ఫిడెంట్ గా ఫేస్ చేసి చూడాలి. దీంతో మనపై మనకు నమ్మకం పెరిగి యాంగ్జైటీ నుంచి బయటపడొచ్చు. నచ్చిన వాళ్లతో లేదా పార్ట్ నర్ తో ఐడియాస్ ని షేర్ చేసుకోవడం, ఏదైనా విషయం గురించి మాట్లాడటం స్టార్ట్ చేయాలి. దీంతో, బయటివాళ్లతో, మీటింగ్స్ లో మాట్లాడేందుకు భయాన్ని పోగొట్టుకోవచ్చు. తెలిసిన విషయాన్ని ఎలా చెప్తున్నామని చెక్ చేసుకునేందుకు సెల్ఫ్ గా రికార్డ్ చేసుకుని వింటే మనల్ని మనమే మరింత సవరించుకోవచ్చు.

ఎలా పోగొట్టుకోవాలి?

పరిస్థితులను డిఫరెంట్ వేరియేషన్స్ లో ఆలోచించే ప్రయత్నం చేయాలి. నేనెందుకు ఇలా ఆలోచించాలి అని ప్రశ్నించుకోవాలి. రకరకాల ఆలోచనల ద్వారా నెగెటివ్ థాట్స్ కి ఫుల్​స్టాప్ పెట్టాలి. లేదంటే అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.. మరింత ఇన్ఫర్మేషన్ తెలిసేవరకు ఎలాంటి డెసిషన్​కి రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడు అనవసరపు భయాలను పోగొట్టుకోవచ్చు.

సెల్ఫ్ కాన్ఫిడెన్సే మంచి మెడిసిన్

ఏదైనా జరుగుతుందేమో అనే భయమే యాంగ్జైటీ. ఇలాంటి టెన్షన్ ఫీలింగ్ వల్ల ప్యానిక్ ఎటాక్ రావొచ్చు. కొంతమందిలో బాడీ మజిల్స్ పట్టేయడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. యాంగ్జైటీ డిజార్డర్ నుంచి స్టార్టింగ్ లెవెల్ లో ఈజీగా బయటపడొచ్చు. అందుకు, ఎలాంటి విషయాల్లో యాంగ్జైటీ కలుగుతోంది అనేది లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాతి రోజుల్లో ఎలాంటి ఆపద రాలేదనే విషయాల్ని గమనిస్తూ బేరీజు వేసుకోవడంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి యాంగ్జైటీ దూరం అవుతుంది. ప్రతిరోజు మజిల్స్ రిలాక్సేషన్​కి సంబంధించిన ఎక్సర్​సైజెస్ కూడా చేసుకోవాలి. దీనివల్ల యాంగ్జైటీ కలిగినప్పుడు వచ్చే మజిల్స్ పట్టేయడం వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రీతింగ్​ కంట్రోల్ ఎక్సర్​సైజెస్ ప్రాక్టీస్  చేయాలి. దాంతో సఫకేషన్ లాంటి సిచువేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రాక్టీస్ చేశాక కూడా యాంగ్జైటీ వేధిస్తుంటే సైకియాట్రిస్ట్ ని గానీ, సైకోథెరపిస్ట్​ని గానీ సంప్రదించాలి.-విశేష్, సైకాలజిస్ట్

Latest Updates