ఆ హీరో చెమట వాసన భరించలేకపోయా : రకుల్

ఓ సినిమాలోని రొమాన్స్ సాంగ్ లో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది.  మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా హీరోలు, హీరోయిన్ల లైఫ్ స్టైల్ తెలుసుకునేందుకు ఫీట్ ఆప్ విత్ స్టార్స్ అనే షో చేస్తుంది. అయితే ఈషోకి గెస్ట్ గా వచ్చిన రకుల్ ప్రీత్ తనకు ఓ హీరోతో షూటింగ్ లో ఎదురైన చేదు అనుభవం గురించి భయటపెట్టింది. షోలో రకుల్ పర్సనల్ లైఫ్, సినిమా షూటింగ్ గురించి మంచు లక్ష్మి అడిగే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఓ సాంగ్  హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, కానీ  సదరు హీరో నుంచి చెమట దుర్వాసన రావడంతో తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. దుర్వాసన తట్టుకోలేక తానే స్ప్రేకొట్టుకున్నట్లు మనసులో మాటని భయటపెట్టింది. అంతేకాదు ఆ విషయాన్ని గతంలో మీకు చెప్పానంటూ హీరో మ్యాటర్ లోకి మంచు లక్ష్మిని లాగే ప్రయత్నం చేసింది. మధ్యలో నన్ను తీయొద్దంటూ రకుల్ కు సరదగా విజ్ఞప్తి చేసింది లక్ష్మీ.