పుల్వామా అమరవీరుల కుటుంబాలకు సన్మానం

హైదరాబాద్: గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామ ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అసువులుబాసిన సంగతి తెలిసిందే. ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దక్షిణ విభాగం వారి కుటుంబాలను సన్మానించనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ లోని CRPF సౌత్రన్ సెక్టార్, రోడ్ నెంబర్-10 లో ఈ సన్మాన కార్యక్రమం జరపనుంది.

ఈ కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలు ముఖ్య అతిథులుగా రానున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పెషల్ గెస్ట్ గా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11:38 ని.ల వరకూ ఈ ప్రోగ్రామ్ జరగనుంది.

felicitation of crpf martyrs families in hyderabad

Latest Updates