100 మీటర్ల రేస్.. అథ్లెట్లతో కలసి పరిగెత్తిన పిల్లి!

న్యూఢిల్లీ: పరుగు పందెంలో వంద మీటర్ల రేసుకు ఉన్న విశేషం తెలిసిందే. చిరుతలా పరిగెత్తితే తప్ప ఇందులో గెలవడం కష్టం. అలాంటిది ఓ పిల్లి రేసర్లతోపాటు పరుగులో దూసుకెళ్లింది. పిల్లి ఏంటి అథ్లెట్లతో పరుగెత్తడం ఏంటని షాక్ అవుతున్నారా? అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి తెలుసుకోండి. వివరాలు.. టర్కీలోని ఇస్తాంబుల్‌‌లో 100 మీటర్ల రేసు నిర్వహించారు. రేసు మొదలైంది. అథ్లెట్లు వేగంగా పరిగెడుతూ ఫినిషింగ్ లైన్‌‌ వైపు రివ్వున దూసుకొస్తున్నారు. సరిగ్గా వాళ్లు ఫినిషింగ్ లైన్‌‌కు చేరుకుంటున్న సమయంలో వారి మధ్యకు ఒక పిల్లి దూసుకొచ్చింది. ప్లేయర్లతోపాటు పరిగెత్తితన పిల్లి ఫినిషింగ్ లైన్‌‌ను క్రాస్ చేసింది. ఈ వీడియోను టర్కిష్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. రేసులో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన పిల్లి తమను షాక్‌‌కు గురి చేసిందనే క్యాప్షన్‌‌ను ఫెడరేషన్ జత చేసింది. నెట్‌‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి..!

Latest Updates