ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దోచుకుంటున్న మహిళా దొంగలు

వరంగల్ అర్బన్: ఒంటరిగా వెళ్తున్న వారిని.. లేదా ఒంటరిగా నివసిస్తున్న మహిళలను టార్గెట్ చేసి దోచుకుంటున్నారు మహిళా దొంగలు. వీరిని వరంగల్ పోలీసులు పకడ్బందీగా వల పన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 20 తులాల బంగారు, మరో 43 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఇంతెజార్ గంజ్ పోలీసులు.  పక్కాగా రెక్కీ చేసి మరీ దోచుకుంటుండంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. పాత నేరస్తులతో విచారించినా ఎలాంటి క్లూ దొరకలేదు. చివరకు వారిపై అన్ని మార్గాల్లో నిఘా పెట్టి ఆచూకీ కనుగొన్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి.. అనుమానాస్పదంగా తిరుగుతుంటే గుర్తించి పట్టుకున్నారు.  తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. పలుచోట్ల చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates