ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇచ్చినం: రాష్ట్ర సర్కార్

2013లో బార్డర్ లో పాకిస్తా న్ జరిపిన కాల్పుల్లో మరణించిన లాన్స్‌ నాయక్‌ ఎండీ ఫిరోజ్‌ ఖాన్‌‌ కుటుంబానికి రాష్ట్ర సర్కార్ రూ.29.75 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేసిందని గవర్నమెంట్ లాయర్ సంతోశ్ హైకోర్టు కు తెలియజేశారు. జులై 31న ఆ మొత్తా న్ని ఫిరోజ్ ఖాన్ భార్య బ్యాంక్ అకౌంట్ లో జమ చేసినట్లు చెప్పారు. సర్కార్ సాయం చేయడంపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌ సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌ హర్షం వ్యక్తం చేసింది. అయితే డబ్బు జమ చేసిన వివరాలు అందజేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఫిరోజ్‌ ఖాన్‌‌ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇస్తామని 2013లో ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకూ ఆర్థిక సాయం అందజేయలేదని, ఖాన్‌‌ కుటుంబం ఇబ్బందులు పడుతోందని లాయర్ పవన్‌‌ కస్తూరి హైకోర్టు కు లెటర్ రాశారు. దీనిని పిల్ గా స్వీకరించిన హైకోర్టు .. ఎక్స్ గ్రేషియా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఇంతకుముందే ఆదేశించింది. దీనిపై మంగళవారం మరోసారి విచారించింది.

Latest Updates