బంగారంపై పండగ ఆఫర్లు

ఫెస్టివల్ సీజన్‌‌పై డీలర్ల ఆశలు

న్యూఢిల్లీ: బంగారం వ్యాపారుల ఫెస్టివల్ సీజన్‌‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వరుసగా ఐదో వారం కూడా డీలర్స్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. కరోనా లాక్‌‌డౌన్ తర్వాత షాపులు తెరిచినప్పటికీ, ఇంకా యాక్టివిటీ అంతంతమాత్రంగానే ఉంది. అఫీషియల్ డొమెస్టిక్ ధరలపై ఒక ఔన్స్‌‌కు 23 డాలర్ల (దాదాపు రూ.1,700) వరకు ఇండియన్ డీలర్స్ డిస్కౌంట్లు ఇస్తున్నారు.  ఫెస్టివ్ సీజన్ దగ్గరపడుతోందని, ధరలు ఇలానే స్థిరంగా ఉంటే, వచ్చే వారాల్లో డిమాండ్ పెరగడం మొదలవుతుందని ముంబైకి చెందిన రిద్ధిసిద్ధి బులియన్స్ డైరెక్టర్ ముకేశ్ కొఠారీ అన్నారు. ప్రస్తుతం దేశీయంగా గోల్డ్ ఫ్యూచర్స్ పది గ్రాముల రేటు దాదాపు రూ.51,500 వరకు పలుకుతున్నది. ధరల ట్రెండ్‌‌పై క్లారిటీ కోసం జ్యూయల్లర్స్ వేచి చూస్తున్నారని, వచ్చే నెల ప్రారంభంలో మొదలయ్యే పండుగలకు స్టాకును సిద్ధం చేస్తారని ముంబైకి చెందిన మరో డీలర్ అన్నారు. కొంతమంది ఇన్వెస్టర్లు గోల్డ్‌‌ను ఆన్‌‌లైన్‌‌లోనూ, బాండ్స్‌‌రూపంలోనూ కొంటున్నారని తెలిపారు. వీటిని స్టోర్ చేసుకోవడంతోపాటు రిడీమ్ చేసుకోవడమూ ఈజీ కావడమే ఇందుకు కారణం. ఆపద సమయంలో  ఇన్వెస్టర్లకు సురక్షితమైన పెట్టుబడి సాధనం బంగారమే కాబట్టి, వీటి సేల్స్‌‌ తప్పక పెరుగుతాయని బులియన్‌‌ ట్రేడర్లు చెబుతున్నారు.  గ్లోబల్‌‌గా గోల్డ్ ధరలు  ఈ ఏడాది జనవరి నుంచి 31 శాతానికి పైగా పెరిగాయి.

 

Latest Updates