కలిసొచ్చిన కరోనా..లాభాల్ని గడించిన ఈ‌‌ కామర్స్ దిగ్గజాలు

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నిరంగాలు నష్టపోయినా ఈ‌‌ కామర్స్ దిగ్గజాలు లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఉత్పత్తులు విక్రయించిన 70కి పైగా వ్యాపారులు ఏకంగా కోట్లు ఆర్జించారు. మరో 10 వేల మంది లక్షలకు పడగలెత్తారు. ప్రస్తుతం తమ వద్ద 3 లక్షలకు పైగా వ్యాపారులు రిజిస్టర్ చేసుకున్నారని ఫ్లిప్‌కార్ట్  వెల్లడించింది. తమ వద్ద రిజిస్టర్ అయిన వ్యాపారుల సంఖ్య ఈ ఏడాది 20 శాతం మేర పెరిగిందని కూడా తెలిపింది. వారిలో 60 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాలకు చెందిన వారేనని తెలిపింది. కాగా, ఫ్లిప్‌కార్ట్ వేదికగా జరిగిన హోల్‌సేల్ వ్యాపారంలో 50 శాతానికి పైగా ఆర్డర్లు టైర్-2, టైర్-3 సిటీల నుంచే వచ్చాయని తెలుస్తోంది

Latest Updates