వచ్చిండే..: యూట్యూబ్ లో 20 కోట్ల వ్యూస్

Fida song vachinde cross 20 crores views in Youtube

“వచ్చిండే.. పిల్లా మెల్లగ వచ్చిండే..” 2017లో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన ఈ పాట… ఆన్ లైన్ లో ఇంకా మార్మోగుతూనే ఉంది. ఈ పాట యూట్యూబ్ లో లేటెస్ట్ గా… 20 కోట్ల వ్యూస్ క్రాస్ చేసింది.

పూర్తి తెలంగాణ నేటివిటీ, భాషా, యాస, సాహిత్యంతో 2017లో వచ్చిన ఫిదా సినిమా అందరిని అలరించింది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. మూవీలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ సినిమాలోని వచ్చిండే పిల్లా సాంగ్ యూట్యూబ్ లో మొదటినుంచి.. ఎప్పటికప్పడు ట్రెండింగ్ లోనే ఉంది. వ్యూస్ పెంచుకుంటూ… లైక్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ.. భాష, దేశం సరిహద్దులు దాటి ఇతర దేశాల ప్రజలను కూడా ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా.. ఈ సాంగ్ యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ మార్క్ దాటింది.

సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ, రాంకీ  కలసి పాడారు. శక్తికాంత్ ఫిదా చిత్రానికి సంగీమందించారు.

Latest Updates