రాష్ట్రంలో ఇవాళ, రేపు వడగాడ్పులు

  •  నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కడ్డం పెద్దూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46.5 డిగ్రీలు

రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలు చోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావారణ శాఖ తెలిపింది.  రానున్న మూడు రోజుల పాటు వాతావారణం పొడిగా ఉండనుందని ప్రకటించింది. సోమవారం చాలా జిల్లాలో వడగాడ్పులు వీచాయని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్- అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఖమ్మం,  నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

కడ్డం పెద్దూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి.  ఉక్కపోత, వేడితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కడ్డం పెద్దూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46.5, సోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐబీ, మాండలలో 46.4, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కల్దుర్కి, నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పొంకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 46.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42.3 డిగ్రీలు నమోదైంది.

Latest Updates