ఫిఫా అండర్‌-17 ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ వాయిదా

కరోనా కారణంగా మరో టోర్నమెంట్‌ వాయిదా పడింది. ఈ ఏడాది భారత్‌ వేదికగా నవంబర్‌లో జరగాల్సిన, ఫిఫా అండర్‌-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యుల్‌ ప్రకారం నవంబర్‌ 2 నుంచి 21 వరకు జరగాల్సిన ఈ టోర్నీ వాయిదా పడింది. తిరిగి ఈ టోర్నీని ఎపుడు నిర్వహిస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే టోర్నీ నిర్వహించే తేదీలను చెబుతామంది ఫిఫా.

Latest Updates