FIFA World Cup Prize Money: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) చరిత్రలోనే అతిపెద్ద క్రీడాగా రికార్డు సృష్టించబోతోంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్లో మొదటిసారిగా 48 దేశాలు పాల్గొంటున్నాయి, మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, ఈసారి కేవలం మ్యాచ్‌ల సంఖ్య మాత్రమే కాదు.. ప్రైజ్ మనీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే స్థాయిలో ఉండబోతోంది. ఎంతలా అంటే, ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న ఐసీసీ (ICC) నిర్వహించిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 బడ్జెట్‌తో పోలిస్తే ఫిఫా ప్రైజ్ మనీ కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంది.
$871 మిలియన్ల భారీ ప్యాకేజీ:
ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ వరల్డ్ కప్ కోసం మొత్తం $871 మిలియన్లు (సుమారు రూ. 8000 కోట్లకు పైగా) కేటాయించారు. ఇందులో ప్రైజ్ మనీతో పాటు జట్ల ప్రిపరేషన్ గ్రాంట్లు, సబ్సిడీలు కూడా ఉన్నాయి. వాణిజ్యపరంగా ఫిఫా సాధించిన అద్భుత విజయాల వల్లే ఈ స్థాయిలో నిధులు పెంచగలిగామని సంస్థ ప్రకటించింది.
క్రికెట్ వరల్డ్ కప్ కంటే ఎక్కువే:
2023లో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ పూల్ కేవలం $10 మిలియన్లు (సుమారు రూ. 83 కోట్లు) మాత్రమే.. కానీ, 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటికి వెళ్ళిపోయే జట్టుకు కూడా ఫిఫా ఇచ్చే కనీస మొత్తం $12.5 మిలియన్లు ($10 మిలియన్ల ప్రైజ్ మనీ + $2.5 మిలియన్ల ప్రిపరేషన్ గ్రాంట్).
గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్:
సింపుల్‌గా చెప్పాలంటే.. క్రికెట్ వరల్డ్ కప్ మొత్తం టోర్నమెంట్‌లో ఐసీసీ పంచిన మొత్తం సొమ్ము కంటే.. ఫిఫా వరల్డ్ కప్‌లో దారుణంగా ఓడిపోయి ఇంటికి వెళ్లే ఒక్క ఫుట్‌బాల్ జట్టుకు దక్కే సొమ్ము ఎక్కువగా ఉంటుంది. అయితే, క్రికెట్ వరల్డ్ కప్‌లో కేవలం 10 జట్లే ఆడగా, ఫుట్‌బాల్‌లో 48 దేశాలు ఆడుతున్నాయి. అలాగే ఫుట్‌బాల్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్, బ్రాడ్‌కాస్ట్ హక్కుల ఆదాయం క్రికెట్ కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఫిఫా వరల్డ్ కప్ వర్సెస్ క్రికెట్ వరల్డ్ కప్ మధ్య తేడాలు:
ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ (ఫుట్‌బాల్)
* టోర్నమెంట్ స్థానం– ప్రైజ్ మనీ (USD లో)– భారతీయ కరెన్సీలో
* విజేత (Champions)–$50 మిలియన్లు– రూ. 415 కోట్లు
* రన్నరప్ (Runners-up)–$33 మిలియన్లు– రూ. 274 కోట్లు
* మూడో స్థానం– $29 మిలియన్లు– రూ. 240 కోట్లు
*నాలుగో స్థానం–$27 మిలియన్లు– రూ. 224 కోట్లు
*క్వార్టర్ ఫైనలిస్ట్స్ (5-8 స్థానాలు)– ఒక్కో జట్టుకు $19 మిలియన్లు~ రూ. 157 కోట్లు
*రౌండ్ ఆఫ్ 16 (9-16 స్థానాలు)– ఒక్కో జట్టుకు $15 మిలియన్లు~ రూ. 124 కోట్లు
*రౌండ్ ఆఫ్ 32 (17-32 స్థానాలు)–ఒక్కో జట్టుకు $11 మిలియన్లు~ రూ. 91 కోట్లు
*గ్రూప్ స్టేజ్ అవుట్ (33-48 స్థానాలు)– ఒక్కో జట్టుకు $10 మిలియన్లు~ రూ. 83 కోట్లు
* ప్రిపరేషన్ గ్రాంట్– $2.5 మిలియన్లు (ప్రతీ జట్టుకు)– రూ. 20 కోట్లు
ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రైజ్ మనీ:
*టోర్నమెంట్ స్థానంప్రైజ్ మనీ (USD లో)భారతీయ కరెన్సీలో
*విజేత (Champions)– $4 మిలియన్లు– రూ. 33 కోట్లు
*రన్నరప్ (Runners-up)$2 మిలియన్లు– రూ. 16.5 కోట్లు
*సెమీఫైనలిస్ట్‌లో ఓడిన జట్లు– ఒక్కో జట్టుకు $800,000– రూ. 6.6 కోట్లు
*గ్రూప్ స్టేజ్ నుంచి అవుట్ అయిన జట్లు– ఒక్కో జట్టుకు $100,000– రూ. 83 లక్షలు
*గ్రూప్ స్టేజ్ మ్యాచ్ విన్ బోనస్– ప్రతి గెలుపునకు $40,000– రూ. 33 లక్షలు
