అమర్‌‌‌‌నాథ్‌‌ యాత్రకు మరో 5,522 మంది

ఇప్పటి వరకు దర్శించుకున్న 35 వేల మంది

జమ్మూ: దక్షిణ కాశ్మీర్‌‌‌‌లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు గురువారం 5,522 మంది భక్తులు బయలుదేరారు. పహల్గాం, బాల్తాల్‌‌ బేస్‌‌ క్యాంపుల నుంచి భారీ సెక్యూరిటీ మధ్య 235 వాహనాల్లో యాత్రికులు బయలుదేరారని, వారిలో 31 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు చెప్పారు. అమర్‌‌‌‌నాథ్‌‌ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు 35 వేల మంది మంచు లింగాన్ని దర్శించుకున్నారన్నారు. 46 రోజుల పాటు సాగే ఈ యాత్రకు దాదాపు 1.5లక్షల మంది రిజిస్టర్‌‌‌‌ చేసుకున్నారు.

Latest Updates