తండ్రి అంత్యక్రియల నుంచి డైరెక్ట్ గా పోలింగ్ బూత్ కు

లోక్ సభ ఐదో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో ఓటర్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడే పెళ్లి చేసుకున్న నవ జంటలు ఓటు హక్కును వినియోగించుకోవడం ఇటీవల కామన్ గా జరుగుతుంది. అయితే ..ఓ వ్యక్తి మాత్రం తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి శ్మశానం నుంచి డైరెక్ట్ గా పోలింగ్ బూత్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తడి బట్టలతోనే ఓటేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఛాటర్‌పూర్‌లో సోమవారం ఈ సంఘటన జరిగింది.

ఉదయం తండ్రి అంత్యక్రియలు ముగించిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా ఓటు వేశాడు. ప్రస్తుతం  అతడి పొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా..ఓటు హక్కునే వినియోగించుకోలేని వారికి అతడు ఆదర్శం అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అతడు పాపులర్ కావడానికే అలా చేశాడని మరికొంత మంది ట్వీట్స్ చేస్తున్నారు. సాయంత్రం వరకు ఓటు వేసే సమయం ఉంటుంది కదా..ఇంటికి వెళ్లి వచ్చి కూడా ఓటు వేయవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్మశానం నుంచి ఓటేసిన అతడు హాట్ టాపిక్ అయ్యాడు.

 

 

Latest Updates