మొదలైన లోక్ సభ ఐదో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల ఐదో ఫేజ్ కు పోలింగ్ మొదలైంది. ఏడు రాష్ట్రాల్లో ని 51 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. 51 సెగ్మెంట్లలో మొత్తం 674 మంది పోటీపడుతున్నారు. వారిలో 79 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఫిఫ్త్​ ఫేజ్ లో పోటీ పడుతున్న ప్రముఖుల్లో సోనియాగాంధీ, పూనమ్ సిన్హా, స్మృతి ఇరానీ, మహబూబాముఫ్తీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, కృష్ణ పునియా, జ్యోతిమిర్ధా (నాగౌర్ ) తదితరులున్నారు. ఇక పురుషుల విషయానికొస్తే, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, రాజ్ నాథ్  సింగ్ (లక్నో ), రాజ్యవర్థన్‌‌ రాథోడ్‌ , అర్జున్‌‌ రామ్‌‌ మేఘ్వాల్‌‌ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 ఎన్నికలు జరిగే స్థానాలివే..

ఐదో ఫేజ్ లో భాగంగా అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లోని14 లోక్ సభ స్థానాల్లో , రాజస్థాన్ (12), బెంగాల్ (7),మధ్యప్రదేశ్ (7), బీహార్ (5), జార్ఖండ్​(4), జమ్మూకాశ్మీర్ లోని 2 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.

Latest Updates