FIG వరల్డ్ ఛాలెంజ్ : దీపకు గోల్డ్

DEEPAఇండియా జిమ్నాస్టిక్స్ సంచలనం దీపా కర్మాకర్ ఇంటర్నేషనల్ వేదికపై మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం (జూలై-8) టర్కీలోని మెర్సిన్ వేదికగా జరిగిన FIG వరల్డ్ ఛాలెంజ్ కప్‌లో జిమ్నాస్టిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. రెండేళ్ల పాటు గాయం కారణంగా జిమ్నాస్టిక్స్‌ కి దూరమైన దీపా.. తిరిగి యాక్షన్‌ లోకి అడుగుపెట్టగానే అదరగొట్టింది. 14.150 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. అంతేకాక బ్యాలెన్స్ బీమ్ విభాగంలో 11.850 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ముగిసింది. రియో ఓలింపిక్స్‌ లో నాలుగో స్థానంలో ముగించిన దీపా.. ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకుంది. ఈ కారణంగా ఆమె 2018 కామన్‌ వెల్త్ గేమ్స్‌కి కూడా ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. దీపా కర్మాకర్‌ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ఫిజ్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ వరల్డ్‌ చాలెంజ్‌ కప్‌ లో బంగారు పతకం సాధించటం పట్ల భారత దేశం గర్విస్తోందని అన్నారు. ఈ విజయం దీపా పట్టుదలకు, ఓటమి ఒప్పుకోని ధైర్యానికి చిహ్నంగా ఆయన అభివర్ణించారు.

Posted in Uncategorized

Latest Updates