హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. మృతదేహం కోసం గొడవ

పటాన్ చెరు, వెలిమెల నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్​ ఇయర్ విద్యార్థిని సంధ్యారాణి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్నిపోలీసులు పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరచారు. అయితే ఈ రోజు పలు విద్యార్థి సంఘాల నాయకులు, సంధ్యారాణి తల్లిదండ్రుల అనుమతితో ఆమె మృతదేహాన్ని కాలేజీకి తరలించి నిరసన తెలియజేయాలని అనుకున్నారు. అందులో భాగంగా మార్చురీ గది తాళం పగులగొట్టి సంధ్య మృతదేహాన్నితీసుకెళ్లడానికి విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు.మృతదేహం బాక్సు తీసుకొని ఆస్పత్రి గేటు వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని తిరిగి ఆస్పత్రిలోకి తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించగా.. సంధ్య తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు వారికి అడ్డుపడ్డారు. మృతదేహాన్ని అప్పగించాలని సంధ్య తల్లిదండ్రులు పోలీసుల కాళ్లావేళ్లా పడ్డారు. అయినా కనికరించని పోలీసులు..

సంధ్యారాణి తల్లిదండ్రుల్ని విపరీతంగా కొట్టారు. తీవ్ర కోపానికి గురైన పోలీసులు విచక్షణ కోల్పోయి సంధ్య తండ్రిని కాళ్లతో తన్ని మరీ ఈడ్చేశారు. చివరికి సంధ్య మృతదేహాన్ని పోలీసులు మార్చురీ గదికి తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అప్పగిస్తామని పోలీసులు సంధ్య తల్లిదండ్రులకు చెప్పారు. కూతురు చనిపోయిన బాధలో ఉన్న వాళ్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని అక్కడ ఉన్న జనం అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

For More News..

శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

ఓయూలో రేపు జాబ్​ మేళా

ఆత్మహత్యకు పాల్పడిన యువదంపతులు

Latest Updates