సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసు: రంగంలోకి మాల్యా కేసు డీల్ చేసిన సీబీఐ టీమ్..

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ వెల్లడించింది. సుశాంత్‌ సింగ్‌ తండ్రి ఇచ్చిన కంప్లైంట్‌ మేరకు బీహార్‌‌ పోలీసులు సేకరించిన ఆధారాలు అన్నీ తీసుకున్నామని, బీహార్‌‌ పోలీసుల నుంచి హ్యాండ్‌ ఓవర్‌‌ చేసుకున్నామని తెలిపింది. విజయ్‌ మాల్యా కేసును విచారించిన సీబీఐ టీమ్‌ ఈ కేసును డీల్‌ చేయనుంది.‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్‌‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు ఫైల్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు, బీహార్‌‌ పోలీసులు విచారణ చేపట్టారు. సుశాంత్‌ సింగ్‌ గార్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని రియా కూడా కోరింది.

Latest Updates