విమానంలోనే డెలివరి చేసిన వైద్యులు

Filipino baby born in plane ready to fly home
  • ఫిలిప్పీన్స్‌‌‌‌ ప్రయాణికురాలికి నొప్పులు..
  • శంషాబాద్‌‌‌‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌‌‌
  •  సీట్లోనే కాన్పు చేసిన డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: ఫిలిప్పీన్స్‌‌‌‌కు చెందిన ఓ గర్భిణి విమానంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో ప్లేన్‌‌‌‌ను అత్యవసరంగా ఆపి ఆమెకు డెలివరీ చేశారు. తర్వాత జూబ్లీహిల్స్‌‌‌‌ అపోలో ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఈ నెల 8న రియాద్ నుంచి భారత్ మీదుగా ఫిలిప్పీన్స్‌‌‌‌కు వెళ్తున్న విమానంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులొచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టులో ల్యాండ్ చేసి వైద్యం చేయాలని సిబ్బంది నిర్ణయించారు. ఎయిర్‌‌‌‌పోర్టు అధికారుల పర్మిషన్ తీసుకున్నారు. నొప్పులు తీవ్రమవడంతో విమానం ల్యాండయ్యే లోపే డాక్టర్లను సిద్ధంగా ఉంచా రు. ఎయిర్‌‌‌‌పోర్టులో అపోలో క్రెడిల్‌‌‌‌ గైనకాలజిస్టులు, పిడియాట్రిషియన్ల బృందం రెడీగా ఉంది. విమానం దిగగానే వాళ్లు వెళ్లి గర్భిణి కూర్చున్న సీట్లోనే పురుడు పోశారు. ప్లేన్‌‌‌‌లోకి సర్జికల్ బ్లేడ్‌‌‌‌ను అనుమతించకపోవడంతో బొడ్డు తాడు కట్ చేయలేదు. అక్కడి నుంచి తల్లి, బిడ్డలను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ఐదు రోజులు వైద్యం అందించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంతో ఉండటంతో స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర సమయంలో డెలివరీ చేసిన వైద్యులకు ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates