కత్తి మహేష్ మరో సారి అరెస్ట్

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ ను ఇవాల (శుక్రవారం) మరోమారు సీసీస్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో… పోస్టులు చేసిన కేసులో ఇటీవల కత్తి మహేష్ ను హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఫిబ్రవరి నెలలోనూ ఇలానే సోషల్ మీడియాల ద్వారా చేసిన వ్యాఖ్యలపై… హైదరాబాద్ జాంబాగ్ కు చెందిన ఉమేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు . ఈ కేసులో మహేషను మరోమారు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇప్పటికే హిందూ దేవుడిని కించ పరిచిన కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. ఇదే కేసులో పిటీ వారెంట్ పై చంచల్ గూడ జైల్  లో ఉన్న మహేష్ ను… నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో హాజరు పర్చారు పోలీసులు.

Latest Updates