ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

  • ఎన్టీఆర్, అక్కినేనిలతో సూపర్ డూపర్ హిట్లు తీసిన దొరస్వామి
  • 500కు పైగా సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబూటర్ గా వ్యవహరించిన దొరస్వామి  

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. స్వర్గీయ ఎన్టీఆర్, అక్కినేనిలతో చరిత్ర సృష్టించిన  అడవి రాముడు, డ్రైవర్ రాముడు, గజదొంగ, సింహబలుడు, జస్టిస్ చౌదరి,   ప్రేమాభిషేకం, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య, జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి హిట్ సినిమాలు తీశారు.

టీటీడీ బోర్డు మెంబర్ గాను పనిచేశారు. 1994లో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా జరిగినా.. మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. 1987లో తిరుపతి కేంద్రంగా విజయలక్ష్మి పిక్చర్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ప్రారంభించి.. గుంతకల్ కేంద్రంగా చేసుకుని రాయలసీమకు విస్తరించారు. వారం రోజులుగా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్న తరుణంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడవడం తెలుగు సినీ పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

కేఆర్ఎంబీ జ్యూరిస్‌‌డిక్షన్‌‌.. వచ్చే నెలలో నోటిఫై!

20 మంది కిడ్నాపర్లు.. రూ.5 లక్షల డీల్

డేంజర్​లో అమెరికా పాలిటిక్స్

Latest Updates