‘సైరా‘ సెట్ లో అగ్నిప్రమాదం : రూ.2కోట్ల ఆస్తినష్టం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీ సెట్లో  అగ్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో చిరంజీవి ఫాంహౌజ్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. సెట్ అంతా కాలిపోయింది. ఈ విషయం తెలిసిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రెండు కోట్ల వరకు  నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది.  కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మనం సెట్ తో పాటు సైరా  సెట్ కూడా కాలిపోయింది.

 

Latest Updates