నేడు కల్నల్ సంతోష్ కు తుది వీడ్కోలు

  • సూర్యాపేటలోని కాసారం ఫామ్ హౌజ్ లో ఏర్పాట్లు
  •  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహణ
  •  బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పార్థివ దేహం
  •  హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో గవర్నర్, మంత్రుల నివాళి
  •  తర్వాత రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలింపు
  • నేడు ఉదయం 7.45 నుంచి అంతిమయాత్ర
  • అంత్యక్రియల్లో పాల్గొననున్న బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి

 

ఇండో, చైనా ఆర్మీ మధ్య ఘరణలో కన్నుమూసిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేట జిల్లాకేసారంలో జరుగనున్నాయి. అధికార లాంఛనాలతో ఈ కార్య క్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంతోష్ బాబు పార్థీవదేహాన్నిన్నిఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫ్లైట్ లో బుధవారం రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అక్కడ గవర్నర్‌ ‌‌‌తమిళిసై, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి , ఎంపీ రేవంత్రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్మీ ఆఫీసర్లు నివాళులు అర్పించారు. తర్వాత పార్థీవ దేహాన్ని సూర్యాపేటకు తీసుకెళ్లారు. ఏర్పా ట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు అంత్యక్రియల కార్యక్రమానికి హాజరుకానున్నారు.

 రాత్రి 7.45 గంటలకు హకీంపేటకు..

ఇండో చైనా బోర్డర్ నుంచి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్నిబుధవారం ఉదయం 10.30 గంటలకు ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫ్లైట్లో  తీసుకుని బయలుదేరారు. ఉదయం 11.15 గంటలకు చంఢీగడ్‌ ‌ఎయిర్‌‌‌‌ పోర్టుకు, 11.45కి ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ సైనిక వందనం, నివాళులు అర్పించిన తర్వాత.. రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌ ‌శివారులోని హకీంపేట ఎయిర్‌ ‌ఫోర్స్ ‌స్టేషన్‌‌కు వచ్చారు. అప్పటికే పెద్దసంఖ్యలో జనం, మంత్రులు, అధికారులు హకీంపేటకు చేరుకున్నారు. జాతీయ జెండాలతో అమర జవాన్ కు జోహార్లు చెప్పారు. ఎయిర్‌‌ ‌‌ఫోర్స్ ‌స్టేషన్‌‌లో ఆర్మీ అధికారులు సైనిక వందనం సమర్పించారు. రాత్రి 8.25 గంటల టైంలో రోడ్డుమార్గంలో సూర్యాపేటకు తీసుకెళ్లారు. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సంతోష్ బాబు భార్యా పిల్లలను బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సైబరాబాద్‌‌ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ ‌రిసీవ్‌ చేసుకున్నారు . బ్రేక్ ఫాస్ట్ చేయించి హకీంపేటకు తీసుకెళ్లారు.

నేడు కేసారంలో అంత్యక్రియలు

సంతోష్ బాబు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సూర్యాపేటలోని కేసారంలో ఉన్న ఫామ్ హౌజ్లో గురువారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి. సంతోష్ బాబు పార్థివదేహాన్నికడసారి చూసుకునేందుకు సూర్యాపేటలోని ఆయన ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచే ఉదయం 7.45 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. ఇక సంతోష్ దేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్ర భుత్వ ప్రతినిధిగా మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం బాధ్యతలు అప్పగించారు. మంగళవారం రాత్రి సంతోష్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, ఏర్పాట్ల ను పరిశీలించారు.

సూర్యాపేట మెడికల్ కాలేజీకి సంతోష్ పేరు: ఉత్తమ్

ఇండో చైనా ఆర్మీ ఘర్షణలో వీర మరణం పొందిన సంతోష్ బాబుకు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి తమ సంతాపం ప్రకటించారు. వీర మరణం పొందిన సంతోష్ బాబు పేరును సూర్యాపేట మెడికల్ కాలేజీకి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సోదరుడిలా అండగా ఉంటా: సంకినేని

కల్నల్  సంతోష్ బాబు కుటుంబానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు సంకినేని వెంకటేశ్వర్ రావు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారి కుటుంబానికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని చెప్పారు.

అంతిమయాత్రలో పాల్గొననున్న సంజయ్, వివేక్

కర్నల్ సంతోష్ బాబు పార్థివదేహాం వద్ద నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సూర్యాపేటకు రానున్నట్లు సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో చదివిన సంతోష్

వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు చిన్నతనంలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో చదువుకున్నారు. 1988 నుంచి 1993 వరకు సంతోష్ తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ లక్సెట్టిపేట బ్యాంకులో పనిచేశారు. దాంతో సంతోష్ ఇక్కడి శ్రీ సరస్వతి శిశుమందిర్ లోనే ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి దాకా చదువుకున్నా రు. తర్వాత తండ్రికి ట్రాన్స్ఫర్ కావడంతో కొంతకాలం హైదరాబాద్ నల్లకుంటలోని ఓ ప్రైవేటు స్కూళ్లో చదివారు. ఆ తర్వాత ఏపీలోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ కు ఎంపికయ్యారు. లక్సెట్టిపేట లో సంతోష్ తోపాటు చదువుకున్న కొందరు స్నేహితులు, చదువు చెప్పిన టీచర్లు ఆయన మృతిపై దిగ్భాంతి వ్యక్తం చేశారు.

Latest Updates