చివరికి న్యాయమే గెలిచింది: మోడీ

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ప్రధాని మోడీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘చివరికి న్యాయమే గెలిచింది. మన నారీమణులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి భద్రతతో పాటు మరింత గౌరవాన్ని పెంచాల్సిన అవసరముంది. అన్ని రంగాల్లో సమానత్వం, అవకాశాల కల్పన ఎంతో ముఖ్యం. మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలి. దీనికి అందరూ కృషి చేయాలి’ అని ట్వీట్ చేశారు.

ఇవాళ(శుక్రవారం) ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నిర్భయ దోషులకు తీహార్ జైల్లో అధికారులు ఉరి తీశారు.

Latest Updates