15వ ఫైనాన్స్ కమిషన్ 3రోజుల షెడ్యూల్

హైదరాబాద్ : తెలంగాణలో బిజీగా పర్యటిస్తుంది 15 ఫైనాన్స్ కమిషన్ బృందం. ఆదివారం కాళేశ్వరాన్ని విజిట్ చేసిన టీమ్..ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనుంది. ఫైనాన్స్ చైర్మన్ నందకిశోర్‌ సింగ్‌ తోపాటు సభ్యులు డాక్టర్ అనూప్‌ సింగ్, రమేశ్‌చంద్ సోమవారం హైదరాబాద్‌ కు రానున్నారు.

 ఆ షెడ్యూల్ వివరాలు..

-చైర్మన్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మాదాపూ ర్‌లోని ఐటీసీ కోహినూర్‌ లో ప్రత్యే క సమావేశం ఉంటుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, అందవలసిన ఆర్థిక సహకారంపై విజ్ఞాపన పత్రాలను అందజేస్తారు. ఇతర పార్టీల నాయకులు కూడా భేటీ అవుతారు.

-మంగళవారం ఉదయం ఆర్థికసంఘం సభ్యులు హైదరాబాద్‌ లో పర్యటించి ఈ- సేవా కేంద్రాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం జూబ్లీహాల్‌ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థికసంఘం సమావేశం ఉంటుంది. సీఎం కేసీఆర్ రాష్ట్ర పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రం ఏమి కోరుకుంటుందో సమగ్ర నివేదిక సమర్పిస్తారు. ఆర్థికసంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ సమావేశంలో మాట్లాడుతారు. తర్వాత మీడియా సమావేశం ఉంటుంది.

-బుధవారం INBలో లో RBI మాజీ గవర్నర్ వేణుగోపాల్.రెడ్డి ..ఇతర ఆర్థిక వేత్తలతో భేటీ కానుంది.

Latest Updates