రైటాఫ్ అంటే రద్దు కాదు..రాహుల్ ను ఎద్దేవా చేసిన నిర్మలా

న్యూఢిల్లీ: రూ.68,607 కోట్లలో రైటాఫ్స్ విషయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రణ్‌దీప్ సింగ్ సుర్వాలాజే వ్యాఖ్యలను ఆర్థికర్థి మంత్రి నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. ఏ రుణాన్ని కూడా రద్దు చేయలేదని, వారు రైటాఫ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతూ నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. లోన్లను రైటాఫ్ చేయడం అంటే రద్దు చేయడం కాదన్నా రు. ప్రభుత్వం ఫైనాన్షియల్ సిస్టమ్‌ను క్లీనక్లీప్ చేస్తోందని, లోన్లను రైటాఫ్ చేసినా కూడా బారోవర్ నుంచి పూర్తి రికవరీని బ్యాంకులు చేపడతాయని స్పష్టం చేశారు. రైటాఫ్ అంటే ఏమిటో మన్మోహన్ సింగ్‌ నుంచి రాహుల్‌ గాంధి తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. 2009–10 నుంచి 2013–14 మధ్య కాలంలో అంటే యూపీఏ హయాంలోనూ రూ.1,45,226 కోట్ల రుణాలను కమర్షియల్ బ్యాంక్‌లు రైటాఫ్ చేసినట్టుగుర్తు చేశారు. మెహుల్ చోక్సి, విజయ్‌మాల్యా వంటి 50 మంది ఉద్దే శపూర్వక ఎగవేతదారుల రూ.68,607 కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్టుఆర్‌‌టీఐ రిప్లైతో తెలిసింది. ఈ రైటాఫ్ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూ ర్వక ఎగవేతదారులు యూపీఐ కాలంలోని ఫోన్ బ్యాంకింగ్ ద్వారానే ఎక్కువగా లబ్ది పొందారని నిర్మలా విమర్శించారు. వారిని మోడీ ప్రభుత్వం వెతికి పట్టుకుని, బకాయిల ను రికవరీ చేస్తోందని స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో మొండి బకాయిలు 2006–2008 మధ్య కాలం నాటివేనని చెప్పారు. తమకు అనుకూలంగా ఉండే వ్యాపారులకు ఇష్టమొ చ్చినట్లుబ్యాంకుల నుంచి అప్పులు ఇప్పిం చారని వ్యాఖ్యానించారు. అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన వారిని సైతం వెనక్కి రప్పిం చేందుకు నరేంద్ర మోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిర్మలా సీ తారామన్‌ గుర్తు చేశారు. ఎగవేతదారుల వేల కోట్లరూపాయల ఆస్తులను అటాచ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Latest Updates