మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

కాసేపట్లో కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. పూర్తి స్థాయిలో బడ్జెట్  ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా సీతారామన్ అరుదైన ఘనత సాధించబోతున్నారు. 1971లో ప్రధాని ఇందిరాగాంధీనే.. ఆర్థికశాఖను నిర్వహిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ మహిళా ఆర్థికమంత్రికి అవకాశం వచ్చింది.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దేశ ఆర్థిక పరిస్థితి మందగించిన నేపథ్యంలో కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రధాని మోడీ పదేపదే చెబుతున్న నవ భారత ఎజెండా బడ్జెట్ లో ప్రతిఫలిస్తుందని ఆశిస్తున్నారు. గత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ సర్కార్.. ఎన్నికల కోసం కొన్ని వరాలు ప్రకటించింది.  వాటిని కొనసాగించడం నిర్మలకు సవాల్ గా మారింది. ఇక ఉద్యోగులు కూడా ఆదాయపు పన్ను పరిమితి కొంతవరకైనా పెంచుతారనే ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగి పోయినందున.. ఉపాధి కల్పన దిశగా చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది.

Latest Updates