రైతులు అధికారుల దగ్గరకి వెళ్లడం కాదు.. అధికారులే రైతుల దగ్గరకి వెళ్ళాలి

రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి పక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానం పట్ల రైతులకు అవగాహన కల్పించడం కోసం సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  కోటి నలబై లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వాలని సీఎం సూచించారని ఆయన తెలిపారు. రైతులకు రైతుబంధు ద్వారా సంవత్సరానికి 14 వేల కోట్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ‘సంగారెడ్డి జిల్లా కేసీఆర్ ఆలోచనలకు దగ్గరగా ఉంది. సంగారెడ్డి జిల్లాలో రైతులు 55 శాతం పత్తి సాగు చేస్తున్నారు. రైతులకు కల్తీ విత్తనాలు అమ్మిన 11 డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేశాం. రైతులు కంది పంటను ఎంత ఎక్కువగా పండించినా..క్వింటాకు రూ. 5800 చెల్లించి ప్రభుత్వమే కొంటుంది. రైతులు మోతాదుకి మించి యూరియా వాడుతున్నారు. రైతులు అధికారుల దగ్గరకి వెళ్లడం కాదు.. అధికారులే రైతుల దగ్గరకి వెళ్ళాలి. నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వేదికల నిర్మాణాలు జరగాలి. సంగారెడ్డి జిల్లాలో 116 రైతుబంధు వేదికలు.. ఒకేరోజు శంకుస్థాపన జరిగి, ఒకేరోజు ప్రారంభం కావాలి. రైతుబంధు వేదికల నిర్మాణాలకి దాతల సహకారం కావాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు  ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలి’ అని హరీష్ రావు అన్నారు.

For More News..

‘మా కార్పొరేటర్లను డిస్ట్రబ్ చేస్తే.. మేం మీ కార్పొరేట్ వరల్డ్‌ని డిస్ట్రబ్ చేస్తం’

వీడియో: సీసీటీవీలో రికార్డయిన పాక్ విమాన ప్రమాదం

పబ్లిక్ టాయిలెట్‌లో ఉరేసుకున్న యువకుడు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

Latest Updates