బ్యాంకుల సలహాలు కోరుతున్న ఆర్ధిక శాఖ

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ కోసం…

న్యూఢిల్లీ : ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా అవతరించేందుకు బ్యాంక్‌ బ్రాంచ్‌ ల నుంచి సలహాలు స్వీకరిస్తోంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇవాల్టి నుంచి ప్రారంభమై నెలపాటు సాగే ఈ కన్సల్టేషన్ ప్రక్రియలో బ్రాంచుల నుంచి ఐడియాలను తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ లను ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ సూచనలే భవిష్యత్తు లో బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ సిద్ధం చేసేందుకు ఇన్‌ పుట్స్‌‌ లాగా ఉపయోగపడనున్నాయి. ఇండియన్ గ్రోత్ స్టోరీలో యాక్టివ్ పార్టనర్లుగా పీఎస్‌‌బీలను ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశమనిఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024–25 వరకుఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నిర్మిం-చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఉద్దీపన ప్యా కేజీపై నో ఆన్సర్….

ఇండస్ట్రీల సమస్యలను తెలుసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఈ విషయాలపై పీఎంఓతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ఈచర్చలు ముగిసిన తర్వాత, వాటికి అవసరమైనచర్యలు ప్రకటిస్తా మని హామీ ఇచ్చారు. అయితేనెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ కోసం ఏమైనా ఉద్దీపనప్యాకేజీ తీసుకొచ్చే ప్లాన్‌ లో ప్రభుత్వం ఉందా? అనేప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం ఇవ్వకుండా నిరాకరించారు.

Latest Updates