చిన్న వ్యాపారాలకు నో జీఎస్‌టీ

ఏడాదికి రూ. 40 లక్షలలోపు టర్నోవరుంటే కట్టక్కర్లే
రూ. 1.5 కోట్ల లోపుంటే కాంపోజిషన్ స్కీమ్‌కు ఓకే

న్యూఢిల్లీ: ట్యాక్స్‌ పేయర్లకు ప్రభుత్వం మరో గిఫ్ట్‌ ఇచ్చింది. ఏడాదికి రూ. 40 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలకు జీఎస్‌‌టీ నుంచి మినహాయింపులిచ్చింది. మొదట్లో ఇది రూ. 20 లక్షల వరకు ఉంది. దీంతో పాటురూ. 1.5కోట్ల వరకు టర్నోవర్‌ కలిగిన బిజినెస్‌‌లు కాంపోజిషన్‌ ‌స్కీమ్‌‌ను ఎంచుకోవచ్చు. వీరు కేవలం ఒక శాతం జీఎస్‌‌టీని చెల్లిస్తే సరిపోతుంది. వీటితో పాటు ఏడాది టర్నోవర్‌ రూ. 5 కోట్లు కంటే తక్కువగా ఉన్న స్మాల్‌ ట్యాక్స్‌ పేయర్లకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది. జీఎస్‌‌టీర్‌‌–3బీ రిటర్న్‌లేట్‌ ‌ఫైలింగ్‌‌పై విధించే పెనాల్టీని సగానికి తగ్గించి 9 శాతంగా మార్చింది. ఇది వచ్చే నెల 30 లోపు ఫైల్‌ అయ్యే జీఎస్‌‌టీఆర్‌‌–3బీ ఫైలింగ్‌‌లకు వర్తిస్తుంది.

1.24 కోట్లకు జీఎస్‌టీ ట్యాక్స్‌‌‌‌ పేయర్లు ..
జీఎస్‌‌టీ తీసుకురావడం వలన ట్యాక్స్‌ చెల్లించే వారి సంఖ్య రెండింతలయ్యిందని ఫైనాన్స్‌ మినిస్ట్రి పేర్కొంది. ప్రజలు చెల్లించాల్సిన ట్యాక్స్‌ రేట్లు గూడ్స్‌ అండ్‌‌ సర్వీస్‌ ‌ట్యాక్స్‌‌(జీఎస్‌‌టీ) తో తగ్గాయని తెలిపింది.మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ ‌జైట్లీ చనిపోయి సోమవారానికి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఫైనాన్స్‌ మినిస్ట్రీ సోమవారం వరుస ట్వీట్లు చేసింది. జీఎస్‌‌టీకి ముందు సేల్స్‌‌, వ్యాట్‌‌,ఎక్సైజ్ ‌వంటి ట్యాక్స్‌ కలిపి 31 శాతం వరకు ఉండేవని గుర్తుచేసింది. ‘కన్జూమర్‌‌, ట్యాక్స్‌ పేయర్‌ ఫ్రెండ్లీగా జీఎస్‌‌టీని గుర్తిస్తున్నారు. జీఎస్‌‌టీకి ముందు ట్యాక్స్ రేట్లు ఎక్కువగా ఉండడంతో పన్నులు చెల్లించడానికి ఇష్టపడేవారు కాదు. జీఎస్‌‌టీ వలన రేట్లు తగ్గాయి . ట్యాక్స్‌ చెల్లిస్తున్న వారు పెరుగుతున్నారు’ అని ఫైనాన్స్‌ మినిస్ట్రీ పేర్కొంది. అమల్లోకి తెచ్చిన మొదట్లో జీఎస్‌‌టీ కింద 65 లక్షల మంది ట్యాక్స్ చెల్లించేవారని, ప్రస్తుతం ఈ నెంబర్‌ 1.24 కోట్లకు చేరుకుందని తెలిపింది. జీఎస్‌‌టీని జులై 1, 2017లో అమల్లోకి తెచ్చారు. జీఎస్‌‌టీని అమల్లోకి తేవడంలో అరుణ్‌‌జైట్లీ కీలక పాత్ర పోషించారు. ‘ఇండియన్‌ ‌ట్యాక్సేషన్‌‌ సిస్టమ్‌‌లో జీఎస్‌‌టీ చారిత్రాత్మక సంస్కరణగా నిలిచిపోతుంది’ అని ఫైనాన్స్‌ మినిస్ట్రీ ట్వీట్‌‌చేసింది. ‘జీఎస్‌‌టీ వచ్చిన తర్వాత చాలా ఐటెమ్‌‌లపై ట్యాక్స్‌ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం 28 శాతం స్లాబ్‌‌లో లగ్జరీ ఐటెమ్‌‌లు, సిన్‌‌(ఆల్కహాల్‌‌, సిగరెట్లు వంటివి) గూడ్స్‌ ఉన్నాయి. 28 శాతం శ్లాబ్‌‌లో ఉన్న 230 ఐటెమ్‌‌లలో 200 ఐటెమ్‌‌లు తక్కువ స్లాబ్‌‌లలోకి షిఫ్ట్‌ అవుతున్నాయి’ అని ఫైనాన్స్‌ మినిస్ట్రీ పేర్కొంది.

For More News..

కోమాలోకి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్?

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్

Latest Updates