ఫ్లెక్సీలు ఏర్పాటు : టీఆర్‌‌ఎస్‌‌ నేతకు ఫైన్

హైదరాబాద్‌‌, వెలుగుఫ్లెక్సీ రహిత నగరంగా మార్చేందుకు బల్దియా అధికారులు కష్టపడుతున్నారు. తమ ప్రభుత్వమే కదా అనుకున్నారో ఏమో.. మంత్రుల ఫొటోలతో ఓ కార్పొరేటర్​ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు తమ పని తాము చేసుకునిపోయారు. శ్రీనగర్‌‌ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌‌కు ఓ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, వేముల ప్రశాంత్‌‌రెడ్డి వచ్చారు.

ఈ సందర్భంగా అమీర్‌‌పేట కార్పొరేటర్ ఎన్‌‌.శేషుకుమారి స్వాగతం చెబుతూ హోటల్‌‌ సాల్ట్‌‌ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధన ఉల్లంఘనలపై స్పందించిన ఖైరతాబాద్‌‌ జోనల్‌‌ కమిషనర్‌‌ ముషర్రఫ్‌‌ అలీ కార్పొరేటర్‌‌కు రూ.5వేల జరిమానా విధించడంతో పాటు ఆ ఫ్లెక్సీలు తీసి వేయించారు.

Latest Updates