బయట చెత్త వేస్తే ఫైన్ వేయండి

బయట చెత్త వేస్తే 200 రూపాయలు జరిమానా వేయాలంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గ్రామాధికారులకు  సూచించారు. గురువారం కరీంనగర్ మండలం మొగ్ధంపూర్ గ్రామంలో జరిగిన 30 రోజుల పల్లె ప్రణాళిక కార్యక్రమం సభలో ఆయన పాల్గొన్నారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ సర్పంచ్ లను కోరారు. జరిమానాల విషయంలో ప్రతి గ్రామ పంచాయితీ తీర్మానం చేయాలన్నారు.

Latest Updates