చెట్టు నరికినందుకు రూ.2 వేలు ఫైన్‌

కోహెడ, వెలుగు: మొక్కలు.. చెట్లను సంరక్షించుకునే విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దన్న సీఎం కేసీఆర్ పిలుపును కింది స్థాయి నేతలు.. అధికారులు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సొంత ఇంటి లో.. పెరటి చెట్టునైనా సరే నరకకూడదన్న ఆదేశాలను అమలు చేసి అందరికీ ఝలక్  ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామంలో హరితహారం చెట్టును నరికిన ఓ ఇంటి యజమానికి పంచాయతీ సిబ్బం ది రూ.2 వేల పైన్ వేశారు. గ్రామంలో చెట్లను నరికితే చర్యలు తప్పవని సర్పంచ్​గాజుల రమేశ్ హెచ్చరించారు. మొక్కల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన టీ గార్డులను తీసినా జరిమానా విధిస్తామని చెప్పారు.

Latest Updates