మాస్క్ పెట్టుకోపోతే రూ.3ల‌క్ష‌లు, 30మంది గుమిగూడితే రూ.9ల‌క్ష‌లకు పైగా ఫైన్

క‌రోనా వైర‌స్ కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కొన్నిదేశాది నేత‌లు క‌రోనా నిబంధ‌న‌ల్ని మ‌రింత క‌ఠిన త‌రం చేస్తున్నాయి.

ఇక క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యూకే ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగానే అమ‌లు చేస్తున్నారు.

క‌రోనా పై ఆంక్ష‌లు విధించిన ప్ర‌ధాని మాట్లాడుతూ దేశ ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌ల్ని పాటిస్తున్నారు. కానీ నింబంధ‌న‌ల్ని ఇంకా క‌ఠినత‌రం చేయాల్సి ఉంద‌న్నారు. లేదంటే క‌రోనా మ‌రింత విజృంభించే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

అందుకే మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే జ‌రిమానాను వంద పౌండ్ల నుంచి మూడు వేల పౌండ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మొత్తాన్ని 14 రోజుల్లోగా చెల్లించాలి. అలా చెల్లిస్తే 50 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. అంటే సుమారుగా రూ.3 ల‌క్ష‌లు. ఇక వేడుక‌ల్లో 30 మందికి మించి ఎక్కువ మంది హాజ‌రైతే 10 వేల పౌండ్లు అంటే సుమారుగా 9.82 లక్షలు జరిమానా విధిస్తూ యూకే ప్ర‌ధాని బోరిస్ ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates