పేదరికం పోతుందనుకుంటే.. సోమరితనం పెరిగింది.

Finland’s Basic Income Experiment goes failure

ఫిన్లాండ్ . యూరప్ లోని చిన్న దేశం. 3.39 లక్షలచదరపు కిలోమీటర్ల వైశాల్యం. 55 లక్షలజనాభా. కనీస ఆదాయ పథకంపై ఆలోచిస్తున్నఅన్ని దేశాల్లాగానే ఆ దేశమూ ఓ మాట అనుకుంది.పైలట్ ప్రాజెక్టుగా దానిని 2015లో ప్రారంభించిం-ది. 2 వేల మంది నిరుద్యోగులకు నెలనెలా సుమారు రూ.43,685 (634 డాలర్లు) ఇచ్చి చూసింది. సంక్షేమపథకాలు అందుకుంటున్న ఇతర నిరుద్యోగులతో పోల్చి చూసింది. ఫలితం మాత్రం శూన్యం. దానివల్ల పేదరికం పోతుందనుకుంటే.. మరింత పేదరికంలోకి జనం వెళ్లిపోతున్నారని గుర్తించింది. ఉద్యోగం లేనోళ్లు కనీసం ఉద్యోగ ప్రయత్నాలైనా చేశారని, నెలనెలా ఫ్రీగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్న నిరుద్యోగులు మాత్రం ఆ ప్రయత్నాలేవీ లేకుండానే ఉండిపోయారని తేల్చిం ది. దీంతో 2018లో ఆ పైలట్ ప్రాజెక్టును రద్దు చేసేసింది ఆదేశ ప్రభుత్వం.

కేలా అధ్యయనం

నిజానికి ఆ ఐడియా ఇప్పటిదేం కాదు. మిల్టన్ ఫ్రీడ్ మ్యా న్ ప్రతిపాదించిన నెగె టివ్ ఇన్ కం ట్యాక్స్(వ్యతిరేక పన్ను) విధానాన్ని చాలా మంది ఫిన్లాండ్ పరిశోధకులు సమర్థించారు. నెగెటివ్ ఇన్ కంట్యా-క్స్ అంటే.. ప్రభుత్వానికి ప్రజలు పన్ను కట్టడానికిబదులుగా ప్రభుత్వమే ప్రజలకు సంక్షేమ ఫలాలను అందివ్వడం.2003లో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఫిన్నిష్ ఎకానమీ ‘కన్సాంటలస్ /ఎకానమీ 2028’అనే పుస్తకాన్ని రాసింది. అందులో కనీస ఆదాయం చాలా మంచిదని పేర్కొంది. 2007–2011 మధ్య దేశాన్ని పాలించిన రైట్ పార్టీ కూడా దానికే మద్దతు -గా నిలిచిం ది. దాని అనుబంధ వాణిజ్య సంస్థలు,ప్రతిపక్షాలు మాత్రం దానికి వ్యతిరేక గళాన్ని విని-పించాయి. 2013లో కనీస ఆదాయం లాంటి ‘లైఫ్అకౌంట్ ’ అనే పథకాన్ని లి బరా ఫౌండేషన్ అనేసంస్థ సూచించిం ది. 18 ఏళ్లు పైబడిన నిరుద్యోగులబ్యాంకు ఖాతాల్లో 20 వేల యూరోలు (సుమారు రూ. 15.58 లక్షలు) వేయాలని పేర్కొంది. స్టూడెంట్ గ్రాంట్ సిస్టమ్ ను రద్దు చేయాలని సూచించిం ది.అయితే అది అమల్లోకి రాలేదు. కనీస ఆదాయ పథకాన్ని పరీక్షించాలని 2015 మేలో ప్రభుత్వం నిర్ణయించింది. 2015 నవంబర్ లో ఫిన్ని ష్ సోషల్ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూషన్ ‘కే లా’ దానిపై స్టడీమొదలుపెట్టిం ది. నిరుద్యోగులకు ఇలా ఉచితంగాపైసలివ్వడం వల్ల ఒరిగిందేం లేదని ఆ స్టడీ చేసిననిపుణులు, వాల్‌‌‌‌స్ట్రీట్‌‌‌‌ నిపుణులు తేల్చారు. పేదరికం నుంచి బయటపడలేకపోయారని నిర్ధా రించారు. భృతి పొందుతున్న నిరుద్యోగులు ఎలాంటి ఉద్యోగప్రయత్నాలు చేయలేదని, టైంను వృథా చేసుకున్నా -రని, ఉద్యోగం లేదన్న ఆందో ళన వారిలో లేనే లేదని,ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో హాయిగా గడిపేశారనితేల్చారు. అయితే, వామపక్షాల నేతలు మాత్రం ‘రోబో’ల పని రాజ్యంలో నిరుద్యోగం పెరిగిపోతోంద-ని, అలాంటప్పుడు ఈ కనీస ఆదాయ పథకమే కరెక్ట్అని వాదిస్తున్నా రు. వస్తూత్పత్తి లా భాలను ప్రజలకు సమానంగా పంచాలని అంటున్నా రు.

నమీబియా లాభ పడింది

ఆఫ్రికాలోని చిన్న దేశం నమీబియా కనీస ఆదాయ పథకంతో సత్ఫలితాలు పొందింది.జనవరి 2008 నుం చి డిసెంబర్ 2009మధ్య పైలట్ ప్రాజెక్టుగా ఒమితరా, ఒట్జీవెరోగ్రామాల్లో పథకాన్ని అమలు చేసింది. జర్మన్ప్రొటెస్టెం ట్ చర్చ్, జర్మనీ సహకార శాఖ, ఆదేశ ప్రజలూ ఆ పథకానికి ఆర్థిక సాయం అందిం చారు. కనీస వసతుల్లే ని జనానికినెలనెలా సు మారు రూ. 820 (12 డాలర్లు/100నమీబియా డాలర్లు) అందిం చారు. ఈపథకాన్ని ప్రారంభించిన తర్వా త పి ల్లల్లో పోషకాహార లోపం చాలా వరకు తగ్గినట్టుగుర్తించారు. స్కూ ళ్లలో పి ల్లల చేరికలు బా గాపెరిగాయని తేల్చారు. అంతేకాదు, ప్రభు-త్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు దీ టుగా..జనమూ తమ ఆదాయం పెం చుకునేం దుకు ప్రయత్నించారు. సోమరితనం పెరుగుతుం-దన్న కొన్ని వర్గా ల మాటలను తిప్పికొట్టేలా చేశారు. ఇక, పైలట్ ప్రాజెక్టు ముగి శాక.. ఆప్రాజెక్టులో పాల్గొన్న జనానికి మార్చి 2012వరకు రూ. 690 (10 డాలర్లు/80 నమీబియాడాలర్లు) నెలానెలా ఇచ్చారు. వలస వచ్చి-నవాళ్లకు పథకం వర్తించదని తెలిసినా ..పక్క ఊళ్ల నుం చి చాలా మంది జనం వలసవచ్చారు. దీంతో ఆ పథకాన్ని కనీస జాతీయఆదాయంగా ప్రకటిం చారు. ఈ క్రమంలోనేరాల రేటు 42 శాతం తగ్గిందట.

Latest Updates