అరవింద్ యూత్‌లో ఫ్లిప్‌కార్ట్‌ పెట్టుబడి

మైనార్టీ వాటాల కొనుగోలు

న్యూఢిల్లీ : వాల్‌‌మార్ట్ కు చెందిన ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్, అరవింద్ యూత్ బ్రాండ్స్‌లో మైనార్టీ వాటాలను రూ.260 కోట్లకు కొనుగోలు చేసింది. అరవింద్ యూత్ బ్రాండ్స్ ఇటీవలే అరవింద్ ఫ్యాషన్ పేరుతో సబ్సిడరీని ఏర్పాటు చేసింది. ఈ ఇన్వెస్ట్‌మెం ట్ ద్వారా ఫ్లిప్‌‌కార్ట్ గ్రూప్, అరవింద్ ఫ్యాష న్స్ కలిసి పనిచేయనున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఆకరణీయమైన ధరల్లో ప్రొడక్ట్ లను అభివృద్ధి చేయనున్నాయి. ఈ పెట్టుబడి ద్వారా అరవింద్ యూత్ బ్రాండ్స్  ‌టీమ్‌‌తో భాగస్వామ్యమై, తమ పోర్ట్ ఫోలియో ప్రొడక్ట్‌ మార్కెట్‌‌ను మరింత పెంచనున్నామని ఫ్లిప్‌‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ క్రిష్ణమూర్తి చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి బలమైన బ్రాండ్ ఈక్విటీని ఇది అభి వృద్ధిచేసినట్టు పేర్కొన్నారు.

Latest Updates