అత్యాచారం ఆరోప‌ణ‌లు : డైరక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ పై ఎఫ్ ఐఆర్ న‌మోదు

2013లో న‌టి పాయ‌ల్ ఘోష్ ..డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించిన విష‌యం తెలిసిందే. తాజాగా పాయ‌ల్ ఘోష్ చేసిన వ్యాఖ్య‌ల‌తో అనురాగ్ క‌శ్య‌ప్ పై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

పాయ‌ల్ ఘోష్ త‌న లాయ‌ర్ నితిన్ సాత్ పుత్ లు క‌శ్య‌ప్ ఆఫీస్ ప‌రిధిలో ఉన్న వెర్సోవా పోలీసుల్ని సంప్ర‌దించారు. దీంతో క‌శ్య‌ప్ పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసు అధికారులు వెల్ల‌డించారు. అయితే ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయ‌డంతో 2013 జ‌రిగిన ఘ‌ట‌న‌పై పోలీసులు విచారించ‌నున్నారు.

కాగా పోలీసుల్ని సంప్ర‌దించిన అనంత‌రం పాయ‌ల్ లాయ‌ర్ నితిన్ సాత్ పుత్ మాట్లాడుతూ క‌శ్య‌ప్ పై అత్యాచారం, లైంగిక ఆరోప‌ణ‌, నేరాప‌ణ‌లపై ఎఫ్ ఐఆర్ న‌మోదైంద‌ని తెలిపారు.

Latest Updates