సుప్రీంకోర్టుకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై FIR?

దిశను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నిందితులు నిన్నటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్‌ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్‌కౌంటర్‌‌పై పూర్తి దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని లాయర్లు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు 2014లో విడుదల చేసిన మార్గదర్శకాలను పోలీసులు ఫాలో అవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.

Latest Updates