ముఖేష్ కుమార్ పై కేసు : పరారీలో హాకీ మాజీ కెప్టెన్

హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్ పై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నకిలీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు ముఖేష్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. రెండు వారాల క్రితం FIR నమోదు చేశారు బోయినపల్లి పోలీసులు. ముఖేష్ సోదరుడు సురేష్ పై కూడా చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.

నాయీబ్రాహ్మణ కులానికి చెందిన ముఖేష్ నకిలీ పత్రాల ద్వారా ఎస్సీ సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం ఉంది. 2007లోనే విచారణ చేయాలని అప్పటి హైదరాబాద్ కలెక్టర్ ను ఇండియన్ ఎయిర్ లైన్స్ విజిలెన్స్ అధికారులు కోరారు. 2018 నవంబర్ లో ఇదే విషయంపై చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ తహశీల్దార్ ను ఆదేశించారు హైదరాబాద్ కలెక్టర్. దీంతో రెండు వారాల క్రితం ముఖేష్ కుమార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ముకేష్ కుమార్ అర్జున అవార్డ్ గ్రహీత. 2007లో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం కోసం ముఖేశ్ అప్లై చేసినప్పుడు… విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ముఖేశ్ కుమార్ పరారీలో ఉన్నాడనీ… మూడు బృందాలుగా విడిపోయి అతడి కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Latest Updates