BJP అభ్యర్థి గౌతం గంభీర్ పై F.I.R.

బీజేపీ అభ్యర్థి, క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది కేంద్ర ఎన్నికల కమిషన్. గౌతమ్ గంభీర్ రూల్స్ పాటించకుండా తూర్పు ఢిల్లీలో రోడ్డు షో నిర్వహించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఈసీ… ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలుచేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. గౌతం గంభీర్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్డ్ ను వయొలేట్ చేశారని ఈస్ట్ ఢిల్లీ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.మహేశ్ చెప్పారు.

తూర్పు ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు గౌతం గంభీర్. ఆయనకు రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందంటూ… ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఆతిషి గంభీర్ పై ఈసీకి మరో ఫిర్యాదుచేశారు. నామినేషన్ పేపర్లలో గంభీర్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అడ్వకేట్ మొహమ్మద్ ఇర్షాద్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు మే 1న విచారణకు రానుంది.

Latest Updates