చలి కాచుకుంటున్న వృద్ధురాలు సజీవదహనం

కామారెడ్డి జిల్లా : అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు సజీవదహనమైన విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. జుక్కల్‌ మండలం కౌలాస్‌ లో గ్రామానికి చెందిన ఓ ముసలవ్వ .. తీవ్రమైన చలి ఉండడంతో సోమవారం తెల్లవారుజామున ఆమె నివాసం ఉంటున్న గుడిసెలోని పొయ్యిలో మంటలు వేసుకుంది.

ప్రమాదవశాత్తు ఆ మంటలు గుడిసెకు అంటుకోవడంతో ఆమె సజీవదహనమైంది. వృద్ధురాలి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కౌలాస్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కి తరలించారు.

Latest Updates